- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లవర్స్‌కు భారీ గుడ్‌న్యూస్.. ప్రేమికుల ఆలయం.. పారిపోయి వస్తేనే ఎంట్రీ!
దిశ, ఫీచర్స్: నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులందరూ గాల్లో విహరించే రోజు. ప్రేమికులందరూ ఎంతగానో ఎదురుచూసిన రోజు రానే వచ్చేసింది. ప్రతి ఏటా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. పార్టనర్స్‌కు గిఫ్ట్స్, గ్రీటింగ్ కార్డ్స్, ఫ్లవర్స్ ఇస్తూ తమ ప్రేమని వ్యక్తం పరుస్తుంటారు. ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ఈ సెలబ్రేషన్స్ హడావుడి మొదలైపోతుంది.
ఓ వారం ముందు నుంచే రకారకాల డేలను జరుపుకుంటూ లవర్స్ హంగామా చేస్తుంటారు. అయితే కామన్‌గా ప్రేమికులందరూ ఓ ఏజ్ వచ్చాక.. తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయం తెలిపి వివాహం చేసుకోవాలనుకుంటారు. కానీ మన దేశంలో లవ్ మ్యారేజ్ కాన్సెప్ట్ చాలామంది పేరెంట్స్‌కు నచ్చదు. ఇరు కుటుంబాల నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. కొందరు తల్లిదండ్రుల మాటను గౌరవించి.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే మరి కొంతమంది ఇంట్లో నుంచి పారిపోయిన చేసుకుంటారు.
అయితే ఇలా పారిపోయి పెళ్లిళ్లు చేసుకునే జంటల కోసం ఆశ్రయం కల్పించే ప్రేమికుల ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ అందమైన దృశ్యాల మధ్య కులులోని షాంగాడ్ గ్రామంలో ఒక పురాతన శివాలయం ఉంది. ‘షాంగ్చుల్ మహాదేవ్’గా ప్రసిద్ధి చెందిన ఈ శివాలయం సుమారు 128 బిఘాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుందట. తల్లిదండ్రలు పెళ్లికి అంగీకరించకపోతే.. ఇంట్లో నుంచి పారిపోయిన వచ్చిన ప్రేమ జంటలకు ఈ గుడిలో పెళ్లి చేసి, 6 నెలల పాటు ఆశ్రయం కల్పిస్తారట.
పైగా అన్ని సౌకర్యాలు కల్పించడం తో పాటు.. కుటుంబీకులు, పోలీసుల నుంచి ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా రక్షణగా నిలుస్తారు. ఈ టెంపుల్‌కు వెళ్లిన ప్రేమ జంటల విషయంలో కూడా పోలీసులు జోక్యం చేసుకోలేరట. ఆలయం లోపలికి రావడానికి కూడా పోలీసులకు అనుమతి లేదు. షాంగ్చుల్ మహాదేవ్ ఆలయం మహాభారత కాలం నాటిదని భావిస్తున్నారు. అగ్యత్యుల కాలంలో పాండవులు ఈ గ్రామానికి వచ్చారు. కౌరవులు వారిని వెంబడించినప్పుడు శివుడు పాండవులను రక్షించాడట, అలాగే ఆలయ సరిహద్దుకు ఎవరు వచ్చినా తానే వారిని రక్షించి, అండగా నిలుస్తానని చెప్పాడట.