TG SET-2024: టీజీసెట్‌-2024 ఫలితాలు విడుదల

by Ramesh Goud |
TG SET-2024: టీజీసెట్‌-2024 ఫలితాలు విడుదల
X

దిశ, వెడ్ డెస్క్: రాష్ట్ర అర్హత పరీక్ష(State Eligibility Test) టీజీ-సెట్‌-2024(TG-SET-2024) ఫలితాలు విడుదల(Results Released) అయ్యాయి. ఈ ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్(Osmania University Vice Chancellor) కుమార్ మొగులారం(Kumar Mogularam) ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి(Balakrishna Reddy)తో కలిసి విడుదల చేశారు. లెక్షరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హతగా నిర్వహించే టీజీసెట్‌ పరీక్ష కీని ఇటీవలే విడుదల చేసిన అధికారులు.. ఇందులో అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించారు.

అనంతరం ఇవాళ టీజీ సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు 26,294 మంది హాజరు కాగా.. 1,884 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ http://telanganaset.org ద్వారా చూసుకోవచ్చని అధికారులు తెలియజేశారు. టీజీ సెట్ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన రోజు తీదీని ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని విద్యాశాఖ కార్యదర్శి నరేష్ రెడ్డి వెల్లడించారు. కాగా తెలంగాణ సెట్-2024(Telangana SET-2024) పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) కంప్యూటర్ బేస్డ్ పద్దతి(Computer Based Method)లో ఆగస్ట్ 28,29,30,31 తేదీలలో నిర్వహించింది.

Advertisement

Next Story

Most Viewed