Mudra Loan Scheme: ముద్ర లోన్స్ ఎన్ని రకాలు.. ఎన్ని లక్షల వరకు రుణం పొందవచ్చు?

by Anjali |
Mudra Loan Scheme: ముద్ర లోన్స్ ఎన్ని రకాలు.. ఎన్ని లక్షల వరకు రుణం పొందవచ్చు?
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం(central) తీసుకొచ్చిన పథకాల్లో ముద్ర లోన్(Mudra Loan Scheme) ఒకటి. 2015 లో పీఎంఏవై పథకం(PMAY Scheme) కింద మొద‌ట వ్య‌వ‌సాయేత‌ర‌(Non-agricultural), కార్పొరేట్(Corporate), సూక్ష్మ ప‌రిశ్ర‌మ‌ల‌కు(micro industries) రుణాలు అందించ‌డం కోసం ఏప్రిల్ 8 వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ఈ పథకాన్ని ప్రారంభించాడు. ఈ స్కీమ్ ద్వారా షూరిటీ(Surety) లేకుండానే 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల లోన్(Loan) పొందొచ్చు. చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు(Small scale industries) ఏర్పాటు చేయాల‌నుకునే ఔత్సాహితుల కోస‌ం మోడీ ఈ స్కీమ్‌ను ప్రారంభించారు.

ముద్ర లోన్(Mudra Loan Scheme) లో మూడు రకాల రుణాలు ఉంటాయి. ఒకటి... రూ. 50 వేల వరకు లోన్ పొందేది శిశు రుణాలు(Child loans). రెండు. కిశోర రుణాల(kishora loans) కింద 50 వేల రూపాయల నుంచి రూ. 5 లక్షల వరకు, తరుణ్ లోన్(Tarun Loan) కింద 5 లక్షల రూపాయల నుంచి రూ. 10 లక్షల వరకు తీసుకోవచ్చు. తరుణ్ ప్లస్ లోన్(Tarun Plus Loan) కింద రూ. 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంది. ఈ లోన్ ఒకేసారి తిరిగి చెల్లిస్తే.. మరోసారి రుణం తీసుకున్నప్పుడు ఒకేసారి రూ. 10 నుంచి 20 లక్షల రూపాయల లోన్ ఇవ్వాలని ఓ కండిషన్ కూడా ఉంది. తమ సొంత గ్రామంలో ఉంటూ వారు ఉపాధి(employment) పొందుతూ.. ఇతరులకు ఉపాధి కల్పించాలనే భావన ఉంటే ఈ ముద్ర లోన్ మంచి ఆప్షన్.

Advertisement

Next Story