Gold Volcano: బంగారాన్ని ఎగజిమ్ముతున్న అగ్ని పర్వతం.. రోజుకూ ఎంతంటే..

by Javid Pasha |
Gold Volcano: బంగారాన్ని ఎగజిమ్ముతున్న అగ్ని పర్వతం.. రోజుకూ ఎంతంటే..
X

దిశ, ఫీచర్స్ : ఈ భూమిపై మంచు పర్వాతాలే కాదు. నిరంతరం సెగలు కక్కుతున్న అగ్ని పర్వాతాలు కూడా ఉన్నాయి. ఇవి నిరంతరం మండుతుంటాయని, నిత్యం లావాను స్రవిస్తుంటాయని మీరు పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. కానీ లావాతోపాటు బంగారాన్ని బయటకు వెదజల్లే మేలిమి అగ్ని పర్వతం(Gold Volcano) గురించి ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. రోజుకూ 80 గ్రాముల బంగారాన్ని బయటకు చిమ్ముతున్న అగ్ని పర్వతం ఒకటి అంటార్కిటా ఖండంలో ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాని పేరే మౌంట్ ఎరెబిస్.

అంటార్కిటా ప్రపచంలోకెల్లా అత్యంత శీతల ప్రదేశం. ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఎప్పుడూ మైనస్ 129 ఫారెన్ హీట్ దగ్గర ఉంటాయి. అయినప్పటికీ ఇక్కడ మంచు కింద 12, 448 అడుగుల ఎత్తులో ఉండే మౌంట్ ఎరెబిస్ (Mount Erebis) అగ్ని పర్వతం మాత్రం సెగలు కక్కుతూ కనిపిస్తుంది. నిరంతరం మండుతున్న రాళ్లు, వేడితో కూడిన గ్యాస్, ఆవిరి ఇక్కడ వెలువడుతుంది. అదే సందర్భంలో ద్రవ రూపంలో, చిన్న చిన్న స్పుటికాల రూపంలో మెరుస్తూ బంగారం కూడా బయటకు వెదజల్లుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే పర్వతం నుంచి బంగారం వస్తుంది కదా అని అక్కడికి వెళ్లి చేసేకరించడానికి అస్సలు వీలు కాదు. ఎందుకంటే ఆ వేడికి ఆ ప్రాంతంలో మనుషులు తిరగడమే కష్టం. కాబట్టి ద్రవరూపంలో బయటకు వచ్చిన బంగారం అంతా అక్కడ గడ్డలు కట్టుకుపోయి కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు మాత్రం పరిశోధనల నిమిత్తం కొంతమేర సేకరించగలిగారు. మరో విషయం ఏంటంటే.. 1979లో 257 మందితో వెళ్తున్న న్యూజిలాండ్‌కు చెందిన ఒక విమానం టెక్నికల్ ప్రాబ్లంవల్ల ఈ మౌంట్ ఎరిబిస్‌ను ఢీకొట్టగా క్షణాల్లో అందరూ చనిపోయారని, జాడ కూడా కనిపించలేదని చెప్తారు. అది మండుతున్న అగ్నిపర్వతం కావడమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు.

Advertisement

Next Story