అమ్మాయిలూ.. లవ్‌కు ఓకే చెబుతున్నారా..? అయితే ఇది మీకోసమే...!

by Nagaya |   ( Updated:2023-02-22 06:28:05.0  )
అమ్మాయిలూ.. లవ్‌కు ఓకే చెబుతున్నారా..? అయితే ఇది మీకోసమే...!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ. ఈ పేరు దేవతల కాలం నుంచి వినపడుతున్నదే.. పురాణాల్లోనూ ప్రేమ కావ్యాలు ఉన్నాయి. కానీ అప్పటి ప్రేమలకు ఇప్పటి వాటికి మధ్య స్వార్ధం, యూజ్ అండ్ త్రో వచ్చి చేరాయి. నాటి ప్రేమల్లో స్వచ్ఛత, నిజాయితీ ఉన్నా.. నేటి ప్రేమల్లో కేవలం అవసరానికి యూజ్ చేసుకోని వదిలేయడం పరిపాటిగా మారిపోయింది. ఇది అబ్బాయిల్లోనూ, అమ్మాయిల్లోనూ ఉన్నది. ఇవాళ ఒకరు.. రేపు మరొకరు అన్నట్లు నేటి ప్రేమలు ఉన్నాయి. వీటిని ప్రేమ అనే దానికన్న ఆకర్షణ, క్షణిక ఆనందం అనాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రేమలు ఎలా ఉన్నా.. ప్రస్తుతం అమ్మాయిలే ఎక్కువ బ్రేకప్ చెబుతున్నారని, అబ్బాయిలను మానసికంగా కృంగదీస్తున్నారని పేర్కొంటున్నారు. అయితే ఒక అబ్బాయి ప్రేమను ఓకే చేసేముందు అమ్మాయిలు అన్నీ ఆలోచించుకోవాలని లేకపోతే వాళ్లు పిచ్చోళ్లు అయ్యే చాన్స్ ఉందని వివరిస్తున్నారు. నేటి రోజుల్లో అమ్మాయిల ప్రేమను అబ్బాయిలు అంత ఈజీగా మర్చిపోవడం లేదని.. అందుకే నిర్ణయం తీసుకునే ముందే భవిష్యత్తును కూడా అంచనాలు వేసి ఓకే చెప్పాలంటున్నారు.

మానసిక నిపుణులు ఏం చెబుతున్నారంటే..


నేటి కాలంలో కొంతమంది టైం పాస్ చేయడానికి ప్రేమిస్తున్నారట. అబ్బాయిలను టీజ్ చేయడానికి, తన అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి వారితో చనువుగా మాట్లాడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారట. అది నిజమైన ప్రేమే అని అబ్బాయిలు గుడ్డిగా వారి మైకంలో పడిపోతున్నారట. అవసరాలు తీరి బోర్ కొట్టిన తర్వాత తూచ్.. ప్రేమ లేదు దోమ లేదు అని అడ్డం తిరుగుతున్నారట. అసలు మనది ప్రేమే కాదు.. ఎక్కువ ఊహించుకోకు అంటూ హృదయాన్ని బద్దలు చేస్తున్నారట. ఈ షాకింగ్‌లతో యువకులు డిప్రెషన్‌కు గురై తమల్ని సంప్రదిస్తున్నారని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి యువకులు ప్రేయసిని నిత్యం తలుచుకుంటూ మానసికంగా బలహీనం అవుతున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని మాములు మనుషులుగా చేయడానికి సంవత్సరాల తరబడి చికిత్స అందించాల్సి వస్తుందని వివరిస్తున్నారు. ఇలా బ్రేకప్‌కు గురైన వారిలో క్రిమినల్ మైండ్ ఉన్నవాళ్లు సైకోలుగా మారే అవకాశం ఉందంట. తమకు దక్కనిది మరొకరికి దక్కొద్దని అత్యాచారాలు, హత్యలు చేయడానికి కూడా వెనకాడరట. కేవలం ఓ అమ్మాయి మోసం వల్ల తమ జీవితాన్ని కోల్పోతున్నారని, జీవిత లక్ష్యాన్ని కూడా మర్చిపోతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు మానసిక నిపుణులు.

అమ్మాయిలూ ఇవి పాటించండి..


ప్రేమించడం అంటే మన జీవితాన్ని వాళ్ల చేతుల్లో పెట్టడం.. వాళ్ల లైఫ్‌ని మనం స్వాధీనం చేసుకోడమే. ప్రేమికురాలి కోసం యువకులు పూర్తిగా బానిసలవుతారు. వాళ్ల గొంతెమ్మ కోరికలు తీర్చడానికి హనుమంతుడిలా మారుతుంటారు. ఇలాంటి వారిని మోసం చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే.

మీరు ప్రేమించలేనప్పుడు అవతలి వ్యక్తితో చనువుగా ఉండకూడదు

ఫోన్ మాట్లాడినా కవ్వింపు చర్యలకు దిగకూడదు

అశ్లీల సంభాషణ, ఉద్రేకమైన వ్యాఖ్యలు చేయకూడదు

ముఖ్యంగా అతడి నుంచి ఎలాంటి గిఫ్ట్‌లు, నజరానాలు స్వీకరించవద్దు

మీకు ప్రేమించే ఉద్దేశ్యమే లేనప్పుడు ఎదుటి వ్యక్తికి ఆ భావనలు కలిగించవద్దు

అతడితో కలిసి సినిమాలు, షాపింగులు చేయకపోవడమే మంచిది

హగ్గులు, కిస్సుల జోలికి అస్సలు పోవద్దు

మీరు స్నేహం చేయాలని అనుకుంటే ముందే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి

అతడితో మీరు ఎందుకు స్నేహం చేస్తున్నారు.. మీ హద్దులను కూడా వివరించడం బెటర్

అయినా అతడు మిముల్ని ప్రేమిస్తున్నాడని అనిపిస్తే ప్రారంభంలోనే దూరం జరగాలి

తను ఎందుకు ప్రేమించలేదో సున్నితంగా వివరించాలి

ఇవ్వి పాటించకుండా టైంపాస్ లవ్ చేస్తే ఎదుటి వ్యక్తి జీవితాన్ని మీరే నాశనం చేసినట్టు అవుతుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎదుటి వ్యక్తి మనోభావం, ఆత్మస్థైర్యం, ఆలోచన శక్తి దెబ్బతీయవద్దని, డిప్రెషన్‌కు గురికాకుండా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 'ప్రేమ'ను గెలిపించలేకపోతున్న జంటలు.. చివరకు విషాదాలుగానే..!

Advertisement

Next Story