- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అమ్మాయిలు ఏ జాబ్ చేసే వ్యక్తిని భర్తగా కోరుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
దిశ, ఫీచర్స్ : పెళ్లి రెండు అక్షరాలే కానీ ఇది ఇద్దరి వ్యక్తుల నూరేళ్ల జీవితం. చాలా మంది పెళ్లి అనగానే భయపడిపోతుంటారు. ఎందుకంటే తమకు తెలియని వ్యక్తి.. కొత్త ప్రదేశం, కొత్త రకం మనుషులు వీరందరితో కలిసిపోవడం అనేది అంత ఈజీ కాదు. అంతే కాకుండా, అమ్మాయిలు కూడా పెళ్లి విషయంలో చాలా ఆశలతో ఉంటారంట. తాము ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. తాను ఏ జాబ్ చేస్తే బాగుంటుంది. తనను ఏ విధంగా చూసుకోవాలి. ఇలా ఎన్నో కోరికలతో పెళ్లికి రెడీ అవుతారు. ముఖ్యంగా జాబ్ విషయంలో వీరు చాలా ఫర్ఫెక్ట్గా ఆలోచిస్తుంటారంట. తమకు కాబోయే వ్యక్తి ఈ జాబ్ చేయాలి. ఇలాంటి వృత్తిలో ఉంటే బాగుంటుందిని ఆశపడుతుంటారు. కాగా, అసలు అమ్మాయిలు ఏ వృత్తిలో, ఏ జాబ్ చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారో ఇప్పుడు చూద్దాం.
ఏ అమ్మాయి అయినా సరే తాను ఓ కంపెనీలో జాబ్ చేస్తుంటే, తన భర్త కూడా అలాంటి జాబ్ చేసే వ్యక్తినే అయి ఉంటే బాగుంటుంది అనుకుంటుందంట. ఒక వేళ తాను డాక్టర్ అయితే తన భర్త కూడా డాక్టర్ అయితే బాగుంటుంది..లేదా ఆమె పోలీస్ అయితే తన భాగస్వామి కూడా పోలీసు కావాలని కోరుకుంటుంది. అంతే కాకుండా జర్నలిజం వృత్తిలో ఉన్నవారు కూడా ఆ వృత్తికి సంబంధించిన అబ్బాయినే వివాహం చేసుకోవాలి అనుకుంటారంట. ఎందుకంటే? ప్రతి ఆడపిల్లా తన భర్తతో ఎక్కువ సమయం స్పెండ్ చేయాలని చూస్తుంది. అంతే కాకుండా సరదాగా బయటకు వెళ్లడం.. లేదే ఏదైనా పార్టీ చేసుకోవాలి అనుకున్నా ఇలా దేనికైనా.. తాను ఒంటరిగా ఉండకుండా తన భర్తతో ఉండాలని ఆశపడుతుందంట. అందుకే ఓకే వృత్తి అయితే టైమింగ్స్ సేమ్ ఉండొచ్చు .. ఒకరికొకరు సమయం ఇవ్వడంలో ఇబ్బంది ఉండదని ఆలోచించి.. అలాంటి భర్తను చూస్ చేసుకుంటారంటున్నారు నిపుణులు.