Girls makeup: రోజూ మేకప్ వేసుకుంటున్నారా?.. తర్వాత ఏం జరుగుతుందంటే..

by Javid Pasha |   ( Updated:2024-08-13 13:20:34.0  )
Girls makeup: రోజూ మేకప్ వేసుకుంటున్నారా?.. తర్వాత ఏం జరుగుతుందంటే..
X

దిశ, ఫీచర్స్ : అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. బయటకు వెళ్లినప్పుడు, పార్టీలు, ఫంక్షన్లకు అటెండ్ అయినప్పుడు అందంగా కనిపించడానికి మేకప్ వేసుకుంటూ ఉంటారు. కానీ ఎల్లప్పుడూ ఇలా చేయడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. వేసుకోకపోతేనే చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

* కొందరు రెగ్యులర్‌గా మేకప్ వేసుకుంటారు. కానీ దీనివల్ల చర్మం నేచురాలిటీని కోల్పోయే అవకాశం ఉంటుంది. వాస్తవానికి మేకప్ వల్ల చర్మం సహజ సౌందర్యాన్ని కోల్పోతుందని చర్మవ్యాధి నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే మేకప్‌ ఎక్కువసేపు ఉండటంవల్ల, అందులోని రసాయనిక పదార్థాల కారణంగా బ్యాక్టీరియాస్ చర్మాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. దీంతో దద్దుర్లు, చర్మం పొడిబారడం, మేకప్ తీసేసిన తర్వాత నల్లగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

* తరచుగా మేకప్ చేయడంవల్ల చర్మంపై సహజంగా ఉండే స్వేద రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు, మొటిమలు వేధిస్తుంటాయి. మేకప్ వేసుకోవడానికి వాడే బ్రష్‌లో బ్యాక్టీరియా చేరడంవల్ల కూడా ఇలా జరగవచ్చు.

* మేకప్‌లో భాగంగా ఐ లైనర్, కళ్లకు మస్కరా వంటివి వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువసేపు అలాగే ఉంచుకోవడం, ఏవైనా పంక్షన్లకు దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు పడుకునేటప్పుడు తొలగించకపోవడం వంటి కారణాలతో ఈ పరిస్థితివల్ల కను రెప్పలపై ప్రభావం పడుతుంది. ఐబ్రోస్ వెంట్రుకలు రాలిపోతాయి. దీంతో తర్వాత అందవిహీనంగా కనిపిస్తారు. వేకప్ వేసుకోకపోతే ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అలాగే కళ్ల అందం కోసం వాడే కాటుకలో కూడా కెమికల్స్ మిక్స్ అవుతాయి. తరచుగా పెట్టుకునే వారిలో పెట్టుకోని వారితో పోలిస్తే కంటిచూపు త్వరగా మందగించే చాన్స్ ఉంటుంది. ఇలా ఏ విధంగా చూసినా మేకప్ వల్ల నష్టమే. పైగా దానివల్ల వచ్చే తాత్కాలిక సౌందర్యం కంటే.. వేసుకోకపోవడంవల్ల వచ్చే సహజ సౌందర్యమే ఆకర్షణీయంగా ఉంటుందని పెద్దలు, నిపుణులు పేర్కొంటున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story