నెయ్యి వల్ల ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు?

by Prasanna |   ( Updated:2023-07-31 07:51:08.0  )
నెయ్యి వల్ల ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు?
X

దిశ, వెబ్ డెస్క్: నెయ్యి వల్ల ఒకటి కాదు.. అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది దీన్ని వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటారు. వేడి వేడి అన్నం, ఆవకాయలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే.. ఆ రుచే చాలా వేరు. అలాగే నెయ్యిని మన ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. నెయ్యి తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

1. నెయ్యిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఒకవేళ మీరు జలుబు, దగ్గుతో బాధ పడే వారు ఆవు నెయ్యి రెండు చుక్కలు ముక్కులో వేస్తే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

2. అంతే కాకుండా అందాన్ని కూడా పెంచుతుంది. ఇది న్యాచురల్‌ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు నెయ్యిని చర్మానికి రాసుకుంటే.. ఉదయానికి మృదువుగా అవుతుంది.

3. పెదాలు పగిలిన వారు నెయ్యిని కొంచం రాసుకుంటే.. వాతావరణం ఎంత చల్లగా ఉన్నా పెదాలు మాత్రం మెరుస్తూ ఉంటాయి. చర్మంపై ఏర్పడే అలర్జీలను తగ్గించడానికీ నెయ్యి బాగా ఉపయోగపడుతుంది.

4. నెయ్యి వల్ల శరీరంలో అనవసర కొవ్వులు పేరుకుపోతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులను కరిగిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed