Cockroach Tips: ఇంట్లో బొద్దింకలను ఈ చిట్కాలతో సులభంగా వదిలించుకోండి!

by Prasanna |
Cockroach Tips: ఇంట్లో బొద్దింకలను ఈ చిట్కాలతో సులభంగా వదిలించుకోండి!
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా ప్రతీ ఇంట్లో బొద్దికంలు ఉంటాయి. వర్షా కాలంలో అయితే అదే పనిగా ఇంట్లో తిరుగుతుంటాయి. దీని వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతే కాకుండా వీటి ఇళ్లు మొత్తం మురికిగా అవుతుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు వీటిని ఇంట్లో రాకుండా చేయాలి లేదా ఇంట్లో ఉన్న వాటిని తరిమికొట్టాలి. దీని కోసం కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

నిమ్మకాయ

బొద్దింకలకు నిమ్మకాయ వాసనను అసలు ఇష్టపడదు. మీ ఇంటి మూలల్లో ఈ ముక్కలను ఉంచితే వాటి వాసనకు బొద్దింకలు రావు. అలాగే బొద్దింకలు ఎక్కువగా వచ్చే ప్లేస్ లో బే ఆకులను పెట్టినా రాకుండా ఉంటాయి.

ఉప్పు

బొద్దింకలను గుట్టలు గుట్టలుగా ఉండే చోట గ్లాస్ లో ఉప్పు నీరు తీసుకుని చల్లితే అవి అక్కడ నుంచి పారిపోతాయి. ఉప్పు నీరు బొద్దింక శరీరంలోకి దాన్ని చంపేస్తుంది.

పురుగుమందులు

బొద్దింకలను తరిమికొట్టడానికి మార్కెట్‌లో ఎన్నో రకాల పురుగుమందులు ఉంటాయి. కాకపోతే వీటిని పిచికారీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed