- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షుగర్ వ్యాధిగ్రస్తులకు 'స్వీట్' న్యూస్.. చక్కెరకు బదులు స్టెవియా!
దిశ, ఫీచర్స్ : మధుమేహంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధి వల్ల ఏటా 1.5 - 1.6 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి. ఒక్క పాలస్తీనా విషయానికొస్తే.. 2.3 మిలియన్ జనాభా గల గాజా స్ట్రిప్‌లో సుమారు 100,000 మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు ఇటీవలే తెలిపారు. అయితే అక్కడి డయాబెటిస్ బాధితుల కోసం ప్రత్యేకంగా స్వీట్లు, కుకీలు తయారుచేస్తున్నట్లు 'హెల్తీ హోమ్' అనే రెస్టారెంట్ ప్రకటించింది. ఈ పదార్థాల్లో చక్కెరకు బదులు 'స్టెవియా' ఉపయోగించడం విశేషం.
32 ఏళ్ల ఆప్టోమెట్రిస్ట్ 'హనా అల్-వకీల్'.. రెండు నెలల కిందట 'హెల్తీ హోమ్' దుకాణాన్ని ప్రారంభించింది. గాజాలో మొదలైన తొలి హెల్తీ ఫుడ్ స్టోర్ ఇదే కాగా 'స్టెవియా' మొక్క ఆకుల నుంచి తీసిన ద్రవాన్ని చక్కెరకు బదులుగా ఉపయోగిస్తోంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం U.S. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన చక్కెర ప్రత్యామ్నాయాల్లో ఇదీ ఒకటి.
డయాబెటిస్ పిల్లలు నిరభ్యంతరంగా..
'డైట్ పాటిస్తున్న వ్యక్తులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, వైట్ షుగర్‌ను తిరస్కరించేవారితో పాటు కొవ్వులు, నూనెలు ఇష్టపడని వ్యక్తులు మా దుకాణంలోని మఫిన్స్, కుకీస్‌ను నిశ్చింతగా స్వీకరించవచ్చు. సాధారణంగా చిన్నారులు స్వీట్స్‌ను అమితంగా ఇష్టపడతారు. కానీ ఇప్పుడు చాలామంది పిల్లలు షుగర్‌తో బాధపడుతున్నందున తల్లిదండ్రులు వారిని తీపి పదార్థాలకు దూరంగా ఉంచుతున్నారు. అలాంటి పిల్లలు ఈ స్వీట్స్‌ను నిరభ్యంతరంగా తినవచ్చు' అని హనా అల్-వకీల్ తెలిపారు.