యాంటీ ఏజింగ్ లక్షణాలు ఫుల్.. రోజూ ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే నిత్య యవ్వనం మీ సొంతం !

by Javid Pasha |   ( Updated:2024-05-27 17:12:49.0  )
యాంటీ ఏజింగ్ లక్షణాలు ఫుల్.. రోజూ ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే నిత్య యవ్వనం మీ సొంతం !
X

దిశ, ఫీచర్స్ : ముప్పై ఏండ్లు కూడా దాటి ఉండవు కానీ మొహంపై ముడతలు కనిపించే వారి సంఖ్య ఇటీవల పెరిగిపోతోంది. ఉరుకులు, పరుగుల జీవన శైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు కూడా ఇందుకు కారణం కావచ్చు. ఏది ఏమైనా చిన్న వయస్సులో చర్మం లేదా మొహంపై ముడతలు రావడం వల్ల కొందరు నామోషీగా ఫీలవుతుంటారు. మరికొందరు బాడీ షేమింగ్ సమస్యలను ఎదుర్కోవచ్చు. అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు మునగాకు అద్భుతంగా ఉపయోగపడుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. ఎలాగో చూద్దాం.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా..

మనకు అంతగా తెలియకపోవచ్చు కానీ, మన చుట్టూ ఉండే అనేక రకాల మొక్కలు, చెట్లు మూలికా వైద్యంలో అద్భుతంగా ఉపయోగపడుతుంటాయి. వివిధ అనారోగ్యాలను దూరం చేస్తుంటాయి. అలాంటి వాటిలో మునగ చెట్టు ఒకటి. దీని ఆకులు, కాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. ఎందుకంటే వీటిలో మినరల్స్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. రోజూ మునగాకు జ్యూస్ తాగడంవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

వృద్ధాప్య ఛాయలు దూరం

మునగాకును వివిధ పద్ధతుల్లో ఉపయోగించడంవల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని యాక్టివేట్ చేస్తుంది. అజీర్తి, కడుపులో, ఛాతీలో మంట వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. మునగాకు రసాన్ని రోజూ ఉదయంపూట పరగడుపున ఒక గ్లాసు తాగడంవల్ల యాంటీ ఏజింగ్ ఔషధంగా ఉపయోగపడుతుంది. స్కిన్ హెల్త్ మెరుగు పడుతుంది. ముఖంపై ముడతలు తగ్గుతాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సితోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి అవి చర్మ కణాల్లో ఫైబ్రో బ్లాస్ట్ డివిజన్‌ని ప్రోత్సహించి చర్మాన్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. బాడీలో వాటర్ లెవల్ పడిపోకుండా డీహైడ్రేషన్ బారినుంచి కాపాడుతాయి. స్కిన్ సెల్స్‌లో ఫ్లెక్సిబిలీటీ పెంచుతూ వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి.

ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ

యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి మునగాకు రసంలో ప్రతి రోజుగానీ, అప్పుడప్పుడు కానీ తాగడంవల్ల శరీరంలోని బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. విబ్రియో కలరా, స్టాఫిలోకోకస్ ఆరియస్ వంటి యాంటీ బయోటిక్ నిరోధకత కలిగిన సూక్ష్మ జీవులపై మునగాకు రసం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

మెంటల్ హెల్త్ బెనిఫిట్స్

మునగాకు జ్యూస్ శారీరక ఆరోగ్యానికే కాదు, మెంటల్ హెల్త్ విషయంలోనూ అద్భుతం చేస్తుంది. మానసిక ఉల్లాసాన్ని ప్రేరేపిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. ప్రతి రోజు ఉదయం మునగాకు రసం తాగితో మెమోరీ పవర్ పెరుగుతుందని, డెమెన్షియా వంటి వ్యాధులు బారి నుంచి కాపాడుతుందని నిపుణులు చెప్తున్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. మెమోరీ లాస్ మెమొరీ లాస్, న్యూరో డీజనరేటివ్ ఇష్యూస్ దూరం చేయడంలో మునగాకు రసం బెటర్‌గా పనిచేస్తుంది.

లివర్ హెల్త్, రక్తహీనత

కాలేయ సమస్యలను నివారించడంలోనూ మునగాకు రసం కీలకపాత్ర పోషిస్తుంది. లివర్‌లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోకుండా నివారిస్తుంది. రోజూ తాగడంవల్ల ఫ్యాటీ లివర్ బాధితులు ఆ సమస్య నుంచి త్వరగా బయటపడే చాన్స్ ఉంటుంది. అంతేకాకుండా రక్త హీనతను కూడా దూరం చేస్తుంది మునగాకు రసం. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడంవల్ల వచ్చే ఎనీమియా వ్యాధిని నివారిస్తుంది. విటమిన్ సి, ఐరన్ పుష్కలంటా ఉంటాయి కాబట్టి హిమో గ్లోబిన్‌ను ప్రోటీన్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య పెంచడం ద్వారా రక్తహీనతకు చెక్ పెడుతుంది.

Read More...

ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఓ వరం యూకలిప్టస్ ఆయిల్.. దీన్ని ఎలా వాడాలో చూసేద్దామా..



Advertisement

Next Story

Most Viewed