- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సగ్గుబియ్యంతో సంపూర్ణ ఆరోగ్యం
దిశ, వెబ్డెస్క్ : సగ్గుబియ్యం గురించి తెలియని వారు ఉండరు. వీటిలో అనేక పోషకాలు ఉన్నాయి. అయితే చాలా మందికి ఇవి ఎలా వస్తాయో తెలియదు. బియ్యంలాగే వీటిని కూడా పొలంలో పండిస్తారని చాలా మంది భావిస్తారు. కానీ వాటిని ఓ రకమైన దుంప నుంచి తయారు చేస్తారని తెలియదు. ఈ సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి, క్యాల్షియం, మరియు మినరల్స్ అధికంగా ఉంటాయి. సగ్గుబియ్యాన్ని నీటిలో ఉడికించి తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయని, బలహీనంగా ఉన్నవారికి సగ్గుబియ్యం ఇస్తే, బలహీనత తగ్గి తక్షణ శక్తి అందుతుందని వైద్యులు చెబుతారు. ఇందులో కొవ్వులు మరియు ప్రోటీన్లు ఉండవు.
అవి మాత్రమే కాదు దీనిలో గ్లూటెన్ కూడా ఉండదు. ఇందులో ఫైబర్, క్యాలరీలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకునే విధానం బట్టి బరువు పెరగడం కానీ, తగ్గడం కానీ జరుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నివారించడానికి బాగా సహాయపడుతుంది. ఇందులో ఖనిజాలు మరియు విటమిన్లు కూడా ఉంటాయి. ఇది ఉపవాసం, డైటింగ్ చేసేవారికి అద్భుతమైన ఆహారం. ఎముకలను పటిష్టం చేయడానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి దోహదపడుతుంది. ఐరన్, కాల్షియం బాగా లభిస్తుంది.
మధుమేహం రోగులకు చక్కటి ఆహారం
సగ్గుబియ్యం ఇన్సూలిన్ ఉత్పత్తిని బాగా పెంచుతుంది. దాంతో రక్తంలో అదనపు చక్కెరను తొలగిస్తుంది. జీర్ణ క్రియ నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. జీర్ణక్రియను నెమ్మది చేయడం ద్వారా రక్తప్రవాహంలోకి అకస్మాత్తుగా అధిక చక్కెరను రానివ్వకుండా చూస్తుంది.
సగ్గుబియ్యం ఎలా తయారు చేస్తారో తెలుసా
సగ్గుబియ్యం ఎలా తయారు చేస్తారో తెలుసా. సగ్గు బియ్యం తయారీకి కర్ర పెండలం అనే దుంపను ఉపయోగిస్తారు. దీన్ని మొదట భూమి నుండి తవ్వి బయటకు తీసిన 24 గంటలలోపు సగ్గు బియ్యం తయారీ కేంద్రానికి పంపించాలి. అక్కడ ఆ దుంపలను నీటిలో బాగా శుభ్రంచేస్తారు. దానిపై ఉన్న తొక్కను తొలిగిస్తారు.
తొక్క తీసిన దుంపలను మరోసారి నీళ్లలో శుభ్ర పరుస్తారు. అప్పుడు ఆ దుంపలను క్రషర్ లో పెట్టి పాలను తీస్తారు. దుంపల నుండి వచ్చిన పాలు ఫిల్టర్ లలోనికి, అక్కడి నుండి సర్క్యులేటింగ్ చానల్స్ లోనికి వెళతాయి. ఈ క్రమంలో పాలలోని చిక్కని పదార్థం ముద్దలా ఉంటుంది. దీనిని రంధ్రాలున్న జల్లెడ లాంటి పాత్రలోకి వెళుతుంది. ఆ జల్లెడ అటు ఇటు కదులు తున్నందున ఆ రంధ్రాల నుండి తెల్లటి పూసల్లాగా జలజలా రాలి పడతాయి. అవి మెత్తగా ఉండటంతో పెద్ద పెనం మీద వేడి చేస్తారు. ఆ తరువాత వాటిని ఆరుబయట ఎండలో ఆర బెడతారు. ఇలా సుమారు 500 కిలోల దుంపల నుండి 100 కిలోల సగ్గు బియ్యం తయారవుతాయి.
Read More: అలాంటి కలలు వస్తే పెళ్లి ఘడియలు దగ్గర పడ్డట్లే..! స్వప్న శాస్త్రం చెబుతుంది ఇదే..!!