- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Fuel Mistakes: పెట్రోల్‌తో నడిచే వాహనంలో డీజిల్ పోయవచ్చా?.. ఏం జరుగుతుంది?
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలామంది టూ వీలర్, ఫోర్ వీలర్ వాడుతున్నారు. ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, హైబ్రిడ్, గ్యాస్ ఇలా రకరకాల ఇంధనాలతో నడిచే కార్లు కూడా మార్కెట్లో కనిపిస్తుంటాయి. ఇలా ఎన్ని ఉన్నప్పటికీ ఇండియాలో మాత్రం పెట్రోల్, డీజిల్ కార్ల హవానే నడుస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే కొన్నిసార్లు పొరపాటునో, మర్చిపోవడంవల్లో పెట్రోల్ కారులో డీజిల్, డీజిల్ కారులో పెట్రోల్ పోయడం లేదా పోయించడం వంటి అనుభవాలను చాలామందే ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? పెట్రోల్‌కు బదులు డీజిల్ వాడొచ్చా? అనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తుంటారు. నిపుణుల సమాధానం ఏమిటో చూద్దాం.
పెట్రోల్ కారులో డీజిల్ పోస్తే?
సాధారణంగా పెట్రోల్ కారులో డీజిల్ పోసినా, డీజిల్ కారులో పెట్రోల్ పోసినా నడుస్తాయి. కానీ ఇలా చేయడంవల్ల ఇంజిన్ డ్యామేజ్ అవుతుందని ఆటోమొబైల్ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే తయారీ సందర్భంగానే పెట్రోల్, డీజిల్ కార్లు లేదా బైకులకు వాటి ఫ్యూయల్ కోసం వేర్వేరు రకాల ఇంజిన్లు తయారు చేస్తారు. దీంతో పెట్రోల్ కారులో డీజిల్ పోస్తే దాని ఇంజిన్ డెన్సిటీగల స్టిక్కీ డీజిల్‌ను బర్న్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఏర్పడుతాయి. ఫలితంగా ఫ్యూయల్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ దెబ్బతింటాయి. అంతేకాకుండా రాంగ్ ఫ్యూయల్ వల్ల కారు స్టార్ట్ అవడంలో ఇబ్బందులు తలెత్తడం, పెద్ద శబ్దంతో నెమ్మదిగా వెళ్లడం జరుగుతాయి. క్రమంగా ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత రిపేరింగ్ కూడా కష్టంగా ఉంటుంది.
డీజిల్ కారులో పెట్రోల్ పోస్తే?
ఇక డీజిల్ కారులో పెట్రోల్ పోసినా అదే జరుగుతుంది. కారు ట్యాంకులోని పైపులు, ఇంజెక్టర్లు పాడవుతాయి. డీజిల్ ఇంజిన్లు ఫ్యూయల్‌ను బర్న్ చేయడానికి దానిని కంప్రెస్ చేస్తాయి. ఆ తర్వాతే ఆయిల్ ఇంజిన్‌కు చేరుతుంది. అయితే పెట్రోల్‌కు అలాంటి అవసరం ఉండదు. పైగా ఇది డీజిల్ కంటే త్వరగా మండుతుంది. దీంతో డీజిల్ కారులో పెట్రోల్ పోయడం వల్ల అది మండే విధానంవల్ల వాహనంలోని భాగాలు పాడవుతాయి. నడుస్తున్నప్పుడు ఇంజిన్ సౌండ్ పెద్దగా వస్తుంది. ఫైనల్లీ ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది.
ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు
దాదాపు చాలామంది రాంగ్ ఫ్యూయల్ కొట్టించరు. కొన్నిసార్లు పెట్రోల్ ధర పెరిగిందని, డీజిల్ తక్కువకు వస్తుందనే ఉద్దేశంతోనో, మర్చిపోవడంవల్లో పెట్రోల్‌కు బదులు డీజిల్, డీజిల్‌కు బదులు పోయిస్తుంటారు కొందరు. అయితే మర్చిపోయి రాంగ్ ఫ్యూయల్ కొట్టించినవారు తమ వాహనం పాడవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చునని ఆటో మొబైల్ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాహనం వెంటనే స్టార్ట్ చేయకూడదు. కారు కంపెనీ కస్టమర్ సర్వీస్‌ను కాంటాక్ట్ అవ్వడం ద్వారా దానిని వేరే వాహనంతో సర్వీస్ సెంటర్‌కు తరలించాలి. అక్కడ ఉండే మెకానిక్‌లు ట్యాంకులోని రాంగ్ ఫ్యూయల్‌ను పూర్తిగా ఖాళీ చేసేసి డ్యామేజ్ కాకుండా క్లీన్ చేస్తారు. ఒకవేళ ఇంజిన్‌లో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయినా రీప్లేస్ చేస్తారు.