Ayurved Aahar Logo: అంతర్జాతీయ మార్కెట్‌ లక్ష్యంగా ఆయుర్వేద ఆహారానికి కొత్త 'లోగో'!

by Sathputhe Rajesh |   ( Updated:2022-06-09 09:46:18.0  )
Fssai Launches ayurveda aahar logo
X

దిశ, ఫీచర్స్ : Fssai Launches ayurveda aahar logo| ఆయుర్వేద ఆహార ఉత్పత్తులకు సంబంధించి 'ఆయుర్వేద ఆహార్' పేరుతో ఓ ప్రత్యేక లోగోను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆవిష్కరించింది.ఆహార ఉత్పత్తులపై ఉన్న ఇతర ప్రామాణిక లోగోల మాదిరిగానే ఇది కూడా 'ఈజీ ఐడెంటిఫికేషన్'కు ఉపయోగపడటంతో పాటు ఆయుర్వేద ఫుడ్ ప్రోడక్ట్స్‌కు ప్రత్యేక గుర్తింపునిస్తుంది. అంతేకాదు ప్రామాణికత, నాణ్యత విషయంలోనూ భరోసాను అందించడం సహా మేక్-ఇన్-ఇండియా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ను విస్తరించడంలో సాయపడుతుంది. ఈ లోగో గురించి మరిన్ని విశేషాలు..

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఆయుర్వేద ఆహార్) రెగ్యులేషన్స్- 2021 ప్రకారం.. ఆయుర్వేద ఆహార్ అనేది అధికారిక పుస్తకాల్లో వివరించిన పద్ధతుల ప్రకారమే వంటకాలు లేదా పదార్థాలు/ ప్రక్రియలకు అనుగుణంగా తయారు చేసిన ఆహారం. అయితే ఇది ఆయుర్వేద ఆహార్ భావనకు అనుగుణంగా ఇతర బొటానికల్ పదార్థాలతో కూడిన ఉత్పత్తులను కూడా కలిగి ఉంటుంది.

* లోగోను పరిశీలిస్తే.. దేవనాగరి అక్షరం ఆ, ఆంగ్ల అక్షరం 'A' ఒకే రూపంలో కనిపించే విధంగా కంబైన్డ్‌గా రాశారు. ఇవి ఆయుర్వేదం, ఆహార్ అనే పదాల ప్రారంభ అక్షరాలను సూచిస్తాయి.

* ఇక అందులోని ఐదు(5) ఆకులు పంచ భూతాలను(ఆకాశం, గాలి, నీరు, అగ్ని, భూమి)సూచిస్తాయి.

* ఆయుర్వేద ఆహార ఉత్పత్తులు నేచురల్, బయోటిక్, హెర్బల్, ఆర్గానిక్‌ అని ఆకుపచ్చ రంగు తెలియజేస్తుంది.

లోగోను ఎక్కడ, ఎలా పొందాలి?

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా'(FSSAI) సంబంధిత నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తుంది. రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్, సర్టిఫికేషన్, ల్యాబోరేటరీ అక్రిడిటేషన్ సహా టెస్టింగ్, క్వాలిటీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు, ఉత్పత్తులకు సంబంధించిన ఆమోదంపై సిఫార్సులను అందించేందుకు కమిటీకి అధికారం ఉంటుంది. 'ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్, సంబంధిత బీఐఎస్ స్పెసిఫికేషన్స్ కింద నిర్వచించిన ప్రమాణాల ప్రకారం పదార్థాల నాణ్యత పారామితులను పాటించాలి' అని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.


Advertisement

Next Story