ఫ్రెంచ్ ఫ్రైస్‌తో డిప్రెషన్.. యువకులే బాధితులు..

by Anjali |   ( Updated:2023-04-25 10:46:56.0  )
ఫ్రెంచ్ ఫ్రైస్‌తో డిప్రెషన్.. యువకులే బాధితులు..
X

దిశ, ఫీచర్స్: బయటకు వెళ్లినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారా? అయితే ఈ పద్ధతి మానుకోమని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. వేయించిన ఆహార పదార్థాలు ముఖ్యంగా ఫ్రైడ్ బంగాళదుంపలు తరుచుగా తీసుకోవడం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని నిర్ధారించారు. ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోని వారితో పోలిస్తే ఆందోళనకు గురయ్యే అవకాశం 12 శాతం ఎక్కువ ఉండగా.. నిరాశతో బాధపడే ప్రమాదం 7 శాతం ఎక్కువ అని కనుగొన్నారు. మానసిక ఆరోగ్యం కోసం ఫ్రైడ్ ఫుడ్ తగ్గించాలని సూచించారు.

దాదాపు 140,728 మందిపై 11 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పాటు సాగిన అధ్యయనంలో ఈ ఫలితాలు రాబట్టిన పరిశోధకులు.. మొదటి రెండేళ్లలో డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిని మినహాయించిన తర్వాత.. వేయించిన ఆహారాన్ని తినేవారిలో మొత్తం 8,294 ఆందోళన, 12,735 డిప్రెషన్ కేసులు కనుగొనబడ్డాయి.

అంతేకాదు క్రమం తప్పకుండా ఒకటి కంటే ఎక్కువ ఫ్రైడ్ ఐటెమ్స్ తీసుకునే వారిలో యువకులు ఎక్కువగా ఉన్నారని, వారే ఇలాంటి మెంటల్ ఇష్యూస్‌తో బాధపడుతున్నారని అధ్యయనం కనుగొంది.

Also Read..

కోడిగుడ్లతో చిప్స్! ఒక్కసారి తింటే వదలరు.!

Advertisement

Next Story