- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ది కేరళ స్టోరీ’ సినిమా చూసిన వారికి టీ, కాఫీ ఫ్రీ!
దిశ, వెబ్‌డెస్క్ : ‘ది కేరళ స్టోరీ’ దేశ వ్యాప్తంగా ఎంత ప్రకంపనలు సృష్టిస్తోందో తెలిసిందే. మాత మార్పిడి ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎంతటి వివాదాన్ని రగిల్చిందో చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రంపై కొన్ని చోట్ల నిషేధం విధించగా.. మరికొన్ని చోట్ల చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటున్నారు. రాజకీయ పార్టీలకు ఎన్నికల అస్త్రంగా మారిన ఈ చిత్రం ఆందోళనలు, ఆగ్రహావేశాల మధ్య విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే ఓ చిరు వ్యాపారి ‘ది కేరళ స్టోరీ’ని తన వ్యాపారవృద్ధికి వినియోగించుకుంటున్నాడు. పైసా ఖర్చు లేకుండా దేశంలో అందరి దృష్టి తన దుకాణంపై పడేలా చేశాడు. ఇంతకూ ఆ వ్యాపారి ఏం చేశాడంటే..
గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని ఒక చాయ్ వాలా బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూసిన ప్రేక్షకులు ఆ సినిమా టికెట్ చూపిస్తే ఉచితంగా టీ, కాపీ ఇస్తానని ప్రకటించారు. ఇదే విషయాన్ని బహిరంగంగా తెలుపుతూ సూరత్‌లోని తన ‘కేసరియా టీ షాప్’ వద్ద పోస్టర్లు అంటించాడు. ఈ ఆఫర్ మే 15 వరకు ఉంటుందని అందులో పేర్కొన్నాడు. చాయ్ వాలా తెలివికి సినీ ప్రియులు సైతం ఫిదా అయిపోతున్నారు. మరోవైపు ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూసిన ప్రేక్షకులు ‘కేసరియా టీ షాప్’ వద్ద క్యూకట్టి కప్పులకు కప్పులు లాగించేస్తున్నారు. ఏదిఏమైనా ‘కేసరియా టీ షాప్’ ఓనర్ ఐడియాకు అందరు ఔరా అంటూ ఫిదా అవుతున్నారు.
Also Read...
కేరళ స్టోరీ సినిమాని వ్యతిరేకించే పార్టీలన్నీ ఉగ్రవాద సంస్థలే.. స్మృతి ఇరానీ