- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉచితంగా మేకల పంపిణీ.. ఎన్నికావాలంటే అన్ని తెచ్చుకోవచ్చట..
దిశ, ఫీచర్స్ : చాలామంది పాడిరైతులు ఆవులను, ఎడ్లను పెంచి వాటిని అమ్ముతూ డబ్బుసంపాదిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో కొన్ని ప్రభుత్వాలు మేకల కొనుగోలు పై సబ్సిడీ ఇస్తుండడంతో మేకల పెంపకం ద్వారా ప్రజలు కూడా సంపాదిస్తున్నారు. ఇక బక్రీద్ సమయంలో మేకల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాంటి మేకలు ఉచితంగా లభిస్తే ఎలా ఉంటుంది. ఆలోచిస్తూనే వావ్ అనిపిస్తుంది కదా. అయితే ఓ ప్రాంతంలో ప్రజలు తమకు కావలసినన్ని మేకలను ఉచితంగా తీసుకెళ్లమని అక్కడి ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మరి ఆ ప్రాంతం ఎక్కడ, ఎందుకు ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటలీలో ఎలికుడి ద్వీపంలో ఈ బంపర్ ఆఫర్ కొనసాగుతుంది. ఇది సిసిలీ ఉత్తర తీరంలో ఉన్న ఏడు అయోలియన్ దీవులలో ఒకటి. ఇక్కడి జనాభా అతితక్కువగా ఉంటుంది. అయితే కొన్నినివేదికల ప్రకారం ఇక్కడ మనుషుల కంటే మేకల సంఖ్యే ఎక్కువ. మొత్తం ద్వీపంలో సుమారు 100 మంది ప్రజలు ఉండగా మేకల జనాభా 600 కంటే ఎక్కువ పెరిగింది. అందుకే ఇక్కడి నుంచి మేకలను ఉచితంగా తీసుకెళ్లొచ్చని అపూర్వ ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా ఈ ఆఫర్ ను పొందాలనుకుంటే అధికారిక ఇమెయిల్‌లో దరఖాస్తును సమర్పించాలి. కేవలం 17 డాలర్లు అంటే దాదాపు రూ. 1400 మాత్రమే చెల్లించాలి. ఆ తర్వాత మేకలను తీసుకోవచ్చు. దరఖాస్తును సమర్పించిన తర్వాత 15 రోజుల సమయం ఇస్తారు. ఈ గడువులో మీరు మీకు కావలసినన్ని మేకలను పట్టుకుని మీతో తీసుకెళ్లవచ్చు. మేకల సంఖ్య 100కి చేరే వరకు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని చెబుతున్నారు.
ద్వీపంలో ఇన్ని మేకలు ఎక్కడ నుండి వచ్చాయి ?
ఒక రైతు ఈ ద్వీపంలో కొన్ని మేకలను వదిలేశాడని, ఆ తర్వాత వాటి జనాభా రోజురోజుకు పెరుగుతూనే ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు మేకలజనాభా ఎక్కువగా ఉండడంతో ద్వీపంలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయట. అంతే కాదు నివాసితుల ఇళ్లలోకి చొరబడి సామాన్లన్నింటినీ ధ్వంసం చేస్తున్నాయట. అందుకే మేయర్ రికార్డో గుల్లో ‘అడాప్ట్ ఏ గోట్ ప్రోగ్రాం’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి. దీని కింద ప్రజలు ఇక్కడి నుంచి ఉచితంగా మేకలను తీసుకెళ్లే స్వేచ్ఛను ఇచ్చారు.