- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమె.. మీకు సరదా?
దిశ, ఫీచర్స్: నలుగురు యువకులు కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో గర్ల్ ఫ్రెండ్, లేదా వైఫ్ గురించిన చర్చలు రావడం గమనించవచ్చు. 'గర్ల్ ఫ్రెండ్‌ను మెయింటెన్ చేస్తున్నవ్ కానీ పెళ్లెప్పుడు?' అని ఒకరంటే.. 'వాడికి పెళ్లయింది కానీ గర్ల్ ఫ్రెండ్‌ను మాత్రం వదలట్లేదు' అని ఇంకొకరంటారు. మరొకరు భార్యను తక్కువ చేసి మాట్లాడుతూ.. గర్ల్ ఫ్రెండ్‌ను పొగుడుతుంటారు.
మరి కొందరు భార్యను ప్రశంసిస్తూ గర్ల్ ఫ్రెండ్‌ను విమర్శిస్తుంటారు. మొత్తానికి పెళ్లైన వారైనా, కాని వారైనా నలుగురు ఐదుగురు ఒక దగ్గర కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ టాపిక్ తప్పకుండా నడుస్తూ ఉంటుంది. ఎందుకిలా? మగవారు ఈ విషయాలపై ఎందుకంత ఆసక్తి చూపుతారు? ఎందుకని చర్చిస్తుంటారు? అనే సందేహాలు కొందరికి కలుగుతుంటాయి.
కొందరు ఒక అమ్మాయి ప్రవర్తన తీరును, లేదా ఆమె వస్త్ర ధారణను సాకుగా చూపుతూ అటువంటి అమ్మాయి భార్యగా వస్తే బాగుంటుందని చెప్తుంటారు. మరి కొందరు అటువంటి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అయితే పర్లేదు కానీ భార్యగా మాత్రం వద్దు అంటున్నారు. ఇవన్నీ ఎందుకని ఒక టాపిక్‌గా మారుతున్నాయి. పోనీ ఏ పనీ పాటా లేని వారు మాత్రమే ఈ అంశాలపై దృష్టి పెడుతూ మాట్లాడుకుంటున్నారు అనడానికి లేదు.
ఖాళీగా ఉండేవారైనా, ఉద్యోగస్తులైనా, పనిచేస్తున్నప్పుడైనా, ప్రయాణాల్లోనైనా ఫ్రెండ్స్‌గా ఉన్న యువకులు లేదా పరిచయస్తులైన యువకులు వారి సరదా సంభాషణల్లో అమ్మాయిల టాపిక్ లేదా భార్యల టాపిక్ తప్పక ఉంటుందని హ్యూమన్ రిలేషన్ షిప్స్‌పై అధ్యయనం చేసిన తన్వి మెహతా అంటున్నారు. సమాజంలో అనేక అంశాల్లో మహిళలు చులకన చేయబడుతున్నారని.. వెటకారాలకు, వ్యంగాస్త్రాలకు బలవుతున్నారని,, సమాజంలో నెలకొన్న పితృస్వామ్య, పురుషాధిక్య భావజాలాలే ఇందుకు కారణమని స్త్రీ వాదులు చెబుతున్నారు.
వేర్వేరు కోణాల్లో ప్రస్తావన..
భార్యను, గర్ల్ ఫ్రెండ్‌ను వేర్వేరు కోణాల్లో ప్రస్తావించే సినిమాలు, కథలు కూడా అనేకం ఉంటున్నాయి. ఒక పురుషుడు ఇంట్లో భార్యను కలిగి ఉండి కూడా.. బయట మరొక గర్ల్ ఫ్రెండ్‌ను కలిగి ఉండటాన్ని సమాజం తప్పు పట్టదు. అలాగే ఒక మహిళ భర్త తప్ప మరో పరాయి మగాడితో ఫ్రెండ్‌షిప్ చేస్తే సమాజం తప్పు పడుతుంది. కనీసం సరదాగా మాట్లాడడానికి కూడా మహిళ అనర్హురాలిగా చాలామంది పరిగణిస్తారు.
'అదేం పద్ధతి మగాళ్లతో అలా నవ్వుతూ మాట్లాడుతున్నావ్' అనే మాటలు ఇప్పటికీ తమ కుటుంబసభ్యుల నోటి నుంచి వింటున్న యువతులు లేరని చెప్పలేం. పురుషులు కలిసినప్పుడు గర్ల్ ఫ్రెండ్, భార్య గురించే జరిగే సంభాషణలు.. అమ్మాయిలు మీట్ అయినప్పుడు జరగడం చాలా అరుదు. దాదాపు ఏ మహిళ కూడా భర్త ఉండగా మరో బాయ్ ఫ్రెండ్‌ను కలిగి ఉంటే సమాజం అంగీకరించదు. పైగా సమస్యలు తలెత్తుతాయి. పురుషుల దాకా ఎందుకు సాటి మహిళలే తప్పుపడుతుంటారు.
ఎలా ఉండాలో కూడా నిర్ణయిస్తున్నారు..
''భార్య అంటే సంప్రదాయ బద్ధంగా ఉండాలి. పరాయి పురుషుడితో మాట్లాడ కూడదు. ఇంట్లో వంట చేయాలి. సేవలు చేయాలి. ఇంటి పనులు చక్కబెట్టాలి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. భర్తకు అణిగిమణిగి ఉండాలి'' అనే భావనతో చాలామంది మగవారు ఉంటారు. ఇలాంటి ప్రవర్తన కలిగినవారే భార్యగా పనికొస్తారని చెప్తుంటారు. పితృస్వామ్య భావజాలానికి నిలువెత్తు నిదర్శనమిది. అలాగే గర్ల్ ఫ్రెండ్ విషయాన్ని పరిశీలించినప్పుడు, భార్య అంతే. భార్య, గర్ల్ ఫ్రెండ్ ఇద్దరూ పాత్రలు వేరైనా పురుషాధిక్య భావజాలానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటోంది.
అంటే.. పురుషుల సంభాషణల టాపిక్‌లో ఇద్దరూ ఒకటే. అయితే గర్ల్ ఫ్రెండ్స్ కాస్త స్వతంత్రత కలిగి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు. ఇంకా పెళ్లి కానందున తన బాయ్ ఫ్రెండ్ ప్రవర్తన నచ్చకపోతే అతనికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మగవారు గర్ల్ ఫ్రెండ్.. సరదాగా గడపడానికి, సినిమాలకు, షికార్లకు వెళ్లడానికి, సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి అనుకూలంగా ఉండాలని అనుకుంటారు.
డిఫరెంట్ కామెంట్స్..
భార్య, గర్ల్ ఫ్రెండ్‌కు తేడా ఏమిటని ఒక రెడ్డిట్ వినియోగదారుడు సరదాగా చేసిన పోస్టుకు అనేక కామెంట్స్ వచ్చాయి. అవి భిన్న కోణాలను ప్రతిబింబించాయి. ఫైనల్‌గా ఇక్కడ మహిళ మాత్రమే బాధితురాలు అనేలా ఆ కామెంట్స్ ఉన్నాయి. గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్ విషయంలో మీరు గమనించే తేడా ఏమిటి? అని రెడ్డిట్ వినియోగదారుడు ప్రశ్నించినప్పుడు.. ''గర్ల్ ఫ్రెండ్‌తో ఎంతైనా ఎంజాయ్ చేయవచ్చు.
కానీ ఆ బంధం పెళ్లిగానో, ఆమె భార్యగానో మారాలంటే చట్టపరమైన, ఆర్థిక పరమైన అంశాలు ముడిపడి ఉంటాయని చాలామంది కామెంట్ చేశారు. మరొక సోషల్ మీడియా వినియోగదారు స్పందిస్తూ "భార్య గురించి చెప్పాలంటే భార్యతో కలిసి ఇల్లు కొనడం, పిల్లలను కనడం" వంటివి ఉంటాయి అన్నాడు. మరొక వ్యక్తి తన కామెంట్‌లో "నన్ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే విషయం ఏదైనా ఉందంటే.. భార్య మాత్రమే'' అన్నాడు.
ఆమెవల్ల తనకు ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నాడు. మరి కొందరు భార్య అంటే కట్నం తెస్తుందని, వంట చేస్తుందని, కుటుంబానికి సలహాలు ఇవ్వడం, భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం చేస్తుందని, బాధ్యతగా మెలుగుతుందని తెలిపారు. గర్ల్ ఫ్రెండ్‌తో రిలేషన్ షిప్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని, అక్కడ బాధ్యత గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అయితే పెళ్లి చట్టపరమైనది కావచ్చు. పెళ్లి తర్వాత బాధ్యతలు ఉండవచ్చు. సంప్రదాయాలు పాటించాల్సి రావచ్చు. కానీ భార్యగా ఆమె అనేక విషయాల్లో వివక్షను ఎదుర్కోవడం, నిర్లక్ష్యం చేయబడటం వంటివి చట్టపరమైనవి కాకున్నా భర్తో, సమాజమో అంటగడుతుండటం గమనించవచ్చు.
అదే పెళ్లికాని యువతి, పురుషుడికి గర్ల్ ఫ్రెండ్‌గా ఉన్నా అనేక విషయాల్లో ఆత్మగౌరవ సమస్యలు ఎదురవుతుంటాయి. బాయ్ ఫ్రెండ్‌కు భయపడో, సర్దుకుపోయో వ్యవహరిస్తూ ఉంటుంది. ఎవరికైనా తమ గురించి తెలిస్తే ఏమనుకుంటారోననే ఫీలింగ్, పితృస్వామ్య సమాజం తమనే తప్పు పడుతుందనే భావన అమ్మాయిలను పలు విషయాల్లో రాజీ పడేలా చేస్తుంది.
ఇలా అనేక అంశాల ఆధారంగా భార్య అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా ఇప్పటికీ పురుషుడిలోని పితృస్వామ్య భావజాలపు కోణంలోనే పరిగణించబడుతున్నారు. అందుకే భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ గురించి పురుషుల్లో ఆ కోణంలోనే టాపిక్ నడుస్తూ ఉంటుంది. అయితే ఆధునిక కాలంలో కొంత మార్పు వచ్చింది. కానీ చులకన చేసే టాపిక్ ల నుంచి మాత్రం ఇంకా మహిళలకు విముక్తి కాలేదు. భవిష్యత్తులో ఇది కూడా మారక తప్పదు అంటున్నారు సామాజిక వేత్తలు.
ఇవి కూడా చదవండి : భార్య పుట్టిన రోజు మర్చిపోతే 5 ఏళ్లు జైలు శిక్షా.. ఎక్కడో తెలుసా?