Iron deficiency: పాలకూర మాత్రమే కాదండోయ్.. ఈ ఆహారాలు తీసుకుంటే ఐరన్ లోపానికి ఇట్టే చెక్ పెట్టొచ్చు

by Anjali |   ( Updated:2024-09-16 10:20:28.0  )
Iron deficiency: పాలకూర మాత్రమే కాదండోయ్.. ఈ ఆహారాలు తీసుకుంటే ఐరన్ లోపానికి ఇట్టే చెక్ పెట్టొచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రపంచవ్యాప్తంగా జనాభాలో సుమారు 15 శాతం మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. బలహీనత, పాలిపోవడం, అంత్య భాగాల చల్లదనం, అలసట, ఊపిరి ఆడకపోవడం, జుట్టు రాలడం, వేలుగోళ్లు పెళుసుగా మారడం, చర్మం పొడిగా మారడం’ వంటివి ఐరన్ లోపం లక్షణాలు. అయితే ఈ ఐరన్ లోపానికి చెక్ పెట్టాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో నిపుణులు చెప్పిన సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం..

* మెంతులు

ఫోలిక్‌ యాసిడ్‌, రైబోఫ్లావిన్‌, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం, కాపర్‌, క్యాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, విటమిన్‌ ఎ, బి6, సి, కె వంటి అనేక పోషకాలు ఉండే మెంతులు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి డయాబెటిస్‌, అధిక బరువు, పీరియడ్‌ క్రాంప్స్‌ వంటి ప్రాబ్లమ్స్‌తో పాటు ఐరన్ లోపాన్ని నివారిస్తుంది.

* ఖర్జూరం

బాడీలో ఐరన్ కంటెంట్ పెరగడానికి ఖర్జూర మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది. కాగా ఖర్జూరాను ప్రతిరోజూ రాత్రి నానబెట్టి తింటే రక్తహీనత మెరుగుపడుతుంది. వీటిలో మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉటాయి. అంతేకాకుండా ఖర్జూరాలో ఉండే ఫైబర్ కంటెంట్ హెల్తీగా ఉండేలా చేస్తుంది.

* వేరుశెనగ

వేరుశెనగలో ఫైబర్‌, ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి తీసుకున్నట్లైతే బోన్స్ స్ట్రాంగ్‌గా మారుతాయి. పైగా వేయించిన వేరుశెనగలు తింటే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు. అంతేకాకుండా వీటిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఇనుము లోపానికి చెక్ పెట్టొచ్చు.

* దుంపలు

ఐరన్ కంటెంట్ అధికంగా ఉండే బీట్‌రూట్, చిలకదుంపలు, బంగళదుంపలు మీ డైట్‌లో చేర్చుకుంటే ఐరన్ లోపాన్ని తరిమికొట్టొచ్చు. దుంపల్లో ఐరన్ కంటెంట్‌ మాత్రమే కాకుండా రాగి, మెగ్నీషియం, భాస్వరం, విటమిన్ B1, B2, B6, B12, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed