రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే ప్రమాదం.. పెరగాలంటే ఇవి తినండి !

by Javid Pasha |
రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే ప్రమాదం.. పెరగాలంటే ఇవి తినండి !
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల చిన్న పిల్లలు, స్త్రీలలో రక్తహీనత సమ్యలు తలెత్తుతున్నట్లు ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి మనం తినే ఆహారం ద్వారా శరీరంలో రక్తం తయారవుతుంది. హిమోగ్లోబిన్ తగినంతగా ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఒకవేళ తక్కువగా ఉంటే రోగనిరోధక వ్యవస్థ పనిచేయదు. దీంతోపాటు వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకే శరీరంలో హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అయ్యేందుకు తప్పకుండా కొన్ని ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

ఆకు కూరలు

హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోకుండా చేయడంలో ఆకుకూరలు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పాలకూర, పాయల్ కూర, తోటకూర, బచ్చలికూర అందుకు దోహదపడతాయి. వీటితోపాటు గ్రీన్ కలర్‌లో ఉండే బ్రొకోలీ, క్యాప్సికం హిమోగ్లోబిన్ లెవల్స్ పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో విటమిన్ 12, విటమిన్ ఎ, సి, అలాగే మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి ఎర్రరక్త కణాల పెరుగుదలకు దోహదం చేస్తాయి.

ఖర్జూరం, దానిమ్మ, బీట్‌రూట్

ఖర్జూరం, దానిమ్మ, అరటి పండ్లు హిమోగ్లోబిన్ స్థాయిని పెంచగలిగే అద్భుతమైన ఫలాలు. దానిమ్మవల్ల బ్లడ్ కౌంట్ పెరుగుతుంది. ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇక ఖర్జూరంలో ఆరోగ్యానికి ఉపయోగపడే సహజ పోషకాలు చాలానే ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్ ఉంటాయి కాబట్టి హిమోగ్లోబిన్ పెరుగుదలకు కారణం అవుతుంది. షుగర్ పేషెంట్లు రోజూ ఒక ఖర్జూరం అయినా తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండు కూడా రోగ నిరోధక శక్తిని, శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఐరన్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. బాడీలో ఫోలిక్ యాసిడ్, రెడ్ బ్లడ్‌సెల్స్ పెరగడంలో అరటిపండు సహాయపడుతుంది. అలాగే బీట్ రూట్, ఉసిరి, నిమ్మ వంటివి కూడా హిమోగ్లోబిన్ పెరుగుదలకు సహాయపడతాయి.

Advertisement

Next Story