ఫొటోల్లో తమను తాము గుర్తిస్తున్న చేపలు..

by samatah |   ( Updated:2023-02-14 04:54:04.0  )
ఫొటోల్లో తమను తాము గుర్తిస్తున్న చేపలు..
X

దిశ, ఫీచర్స్: జంతు రాజ్యంలో బిగ్గెస్ట్ మెమొరీస్ లేనప్పటికీ.. చేపలు గతంలో అనుకున్నదానికంటే ఎక్కువ తెలివైనవని తేలింది. జపాన్‌లోని ఒసాకా మెట్రోపాలిటన్ యూనివర్శిటీ పరిశోధకులు 'క్లీనర్' రాస్సే ఫిష్ 'లాబ్రాయిడ్స్ డిమిడియాటస్' ఫోటోలో తనను తాను గుర్తించగలదని కనుగొన్నారు. ఈ జాతి దాని భూభాగంలో తెలియని చేపలపై దాడి చేస్తుంది. కానీ అపరిచిత చేప శరీరంపై దాని సొంత ముఖ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు ప్రతిస్పందించలేదు. అంటే ఈ చేప ఇమేజ్‌లో తన ముఖాన్ని గుర్తించిందని, తన శత్రువుగా లేదా అపరిచితుడిగా చూడలేదని ఇది సూచిస్తుంది. మొత్తానికి ఈ అధ్యయనం చేపలకు 'సెల్ఫ్ ఇంటెర్నల్ సెన్స్' ఉన్నట్లు గుర్తించింది.

మునుపటి అధ్యయనాలు కొన్ని చేప జాతులు వ్యక్తుల మధ్య తేడాను గుర్తించగలవని చూపించాయి. ఈ లక్షణం ఒకప్పుడు క్షీరదాలకు మాత్రమే ప్రత్యేకమైనదని భావించారు. ముఖాలను ప్రాసెస్ చేయడానికి మానవులకు నిర్దిష్ట మెదడు ప్రాంతం ఉంటుంది. నిర్దిష్ట భాగాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా కాకుండా మొత్తంగా వాటిని రీడ్ చేస్తుంది. అయితే మెదడులోని ఆబ్జెక్ట్-ప్రాసెసింగ్ భాగం ఆక్రమించినందున, తలక్రిందులుగా ఉన్న ముఖాలను గుర్తించడానికి కష్టపడతాము. చేపలకు ఇదే సమస్య ఉన్నట్లు కనుగొన్న శాస్త్రవేత్తలు.. కానీ తమ ముఖాన్ని గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

కాగా ఈ ప్రయోగంలో మొదట ఎనిమిది చేపలను 'మిర్రర్ మార్క్ టెస్ట్'కి గురిచేశారు. వాటి గొంతుపై కలర్ వేయడానికి ముందు, తర్వాత అద్దం అందించారు. ఈ రెండు కేసుల్లోనూ తమను తాము గుర్తించాయని తెలిపారు. తర్వాత వాటికి నాలుగు ఫొటోలు సూచించబడ్డాయి. వాటిలో తన ఫొటో, తెలియని చేపల ఫొటో, తెలియని చేప శరీరంపై సొంత ముఖం, దాని సొంత శరీరంపై తెలియని చేప ముఖం ఉంచబడ్డాయి. వీటిలో తెలియని చేపల పట్ల దూకుడుగా ప్రవర్తించిన క్లీనర్స్ రాస్సే ఫిషెస్.. దాని చిత్రాన్ని మాత్రం విస్మరించాయి. దూకుడు ప్రవర్తనలలో అద్దం వైపు పరుగెత్తడం, శరీరంతో కొట్టడం, కొరకడం వంటివి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : తెలంగాణలో వెలుగు చూసిన శిలాయుగపు చిత్రకళ వర్ణ చిత్రాలు

Advertisement

Next Story