డీప్ ప్రేమలో ఉన్నారా.. అయితే మీ లవ్ బ్రేకప్ అవుతుందేమో ఇలా తెలుసుకోండి

by samatah |
డీప్ ప్రేమలో ఉన్నారా.. అయితే మీ లవ్ బ్రేకప్ అవుతుందేమో ఇలా తెలుసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ రెండు మనుసులలో చిగురించే ఓ అందమైన జ్ఞాపకం. ఇక ఈ ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో ఎవరికీ తెలియదు. కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ప్రేమలోపడుతుంటారు. ఇక కొంత మంది ప్రేమలోపడి తానే సర్వస్వం అంటూ బతుకుతారు. కులం, మతం చూడకుండా పుట్టే ఈప్రేమ.. ఎంతో మందిని తన మాయలో వేసుకొని చివరికి అందరినీ ఏడిపించేస్తుంది. ఎందుకంటే, ఎంతో డీప్‌లో ఉన్న లవర్స్‌ అయినా సరే ఒకానొక టైంలో కొన్ని సంఘటనల వలన విడిపోవాల్సి వస్తుంది. అయితే వారు విడిపోవడానికి కొన్ని సార్లు కారణాలు ఉంటే, మరికొన్ని సార్లు అసలు ఎలాంటి కారణం ఉండదు.

అయితే మీ ప్రేమ బ్రేకప్ అవుతుందని చెప్పడానికి ముందుగా కొన్ని సంకేతాలు ఇస్తుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • దూరంగా ఉన్న అనుభూతి, చిన్న చిన్న విషయాలకు కూడా అలగడం. ఎంత ఫోన్ చేసినా తీయక పోవడం. ఒక వేళ కాల్ లిఫ్ట్ చేసినా మళ్లీ చేస్తానని చెప్పి చేయకపోవడం. మీ మిస్సేజ్‌లకు రిప్లే ఇవ్వక పోవడం మొదట కనిపించే సంకేతాలు.

  • అలాగే, ఎప్పుడూ మీతో నవ్వుతూ మాట్లాడే అమ్మాయి, మిమ్ముల్ని హేళనగా మాట్లాడటం. మీకు చెప్పకుండా అన్ని పనులు చేసుకోవడం, మీతో కాసేపు కూర్చొని మాట్లాడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదంటే మీ ప్రేమ బ్రేకప్ అవుతున్నట్లే.

  • మీకంటే మీ మిత్రులకు ఎక్కువ ప్రిపరెన్స్ ఇచ్చినా, మీతో మాట్లాడటం ఇష్టం లేదని డైరెక్ట్ గా చెప్పినప్పుడు మీ ప్రేమ బ్రేకప్ దిశగా అడుగులు వేస్తుందని గుర్తించాలి.
Advertisement

Next Story

Most Viewed