Feel of love : ఆ మాట వింటేనే యూత్ మైండ్‌లో వెరైటీ ఫీలింగ్.. ఆ తర్వాత బ్రెయిన్‌లో జరిగే మార్పులివే..

by Javid Pasha |
Feel of love : ఆ మాట వింటేనే యూత్ మైండ్‌లో వెరైటీ ఫీలింగ్.. ఆ తర్వాత బ్రెయిన్‌లో జరిగే మార్పులివే..
X

దిశ, ఫీచర్స్ : లవ్.. ఇష్క్.. ప్రేమ.. ఏ భాషలో పలికితేనేం.. దాని భావం ఒకటే.. స్వభావమూ ఒకటే.. వినడానికి రెండక్షరాలే కానీ.. ఓ వయస్సుకంటూ వచ్చాక యువతరాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుందీ చిన్న పదమే. అందుకే అంటారేమో కవులు.. కళాకారులు.. ప్రేమలో పడ్డవారికి మండు వేసవి కూడా నిండు పున్నమిలా అనిపిస్తుందని, కొన్నిసార్లు నిండు పున్నమి కూడా మండే అగ్నిగోళంలా తోస్తుందని.. ఇక ప్రేమ గురించి అడిగినా, చెప్పినా, మాట్లాడినా పెద్దలు టీనేజర్ల స్వభావం తెలియని తనంగా అనిపిస్తుంది. అందులో నిజం లేకపోలేదు. కానీ అది టీనేజర్స్‌కు ఓ పట్టాన అర్థం కాదు. తమ ఫీలింగ్ తమదే అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే లవ్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ మాట వినగానే మనుషుల మెదడులో ఏం జరుగుతుందో తెలుసుకునే ఉద్దేశంతో తాజాగా ఫిన్లాండ్‌కు చెందిన ఆల్టో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో చూద్దాం.

పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు సమాజంలో ఉండే ఆరు రకాల ప్రేమలను ఎనలైజ్ చేశారు. ఇందుకోసం వారు ‘ఫంక్షనల్ మాగ్నెటెక్ రిసోనెన్స్ ఇమేజింగ్ సిస్టమ్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించారు. కాగా తాము పలు ఇంట్రెస్టింగ్ అంశాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ వివరాలు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తరపున వెలువడే సెరెబ్రల్ కార్టెక్స్ జర్నల్‌లో కూడా పబ్లిష్ అయ్యాయి.

పరిశోధనల్లో ఏం తేలింది?

సమాజంలో ప్రేమకు సంబంధించిన భావాలు ఆయా పరిస్థితులను అనుసరించి కూడా కలుగుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే లవ్ అనే మాట విన్నప్పుడు, దానిని అనుభూతి చెందినప్పుడు మనుషుల్లోని నుదుటి మధ్య రేఖ, ప్రిక్యూనియస్, బ్రెయిన్‌లోని బేసల్ గాంగ్లియా, తల వెనుక భాగంలోని టెంపోరోపారిటల్ జంక్షన్ భాగాలు రియాక్ట్ అవుతాయని గుర్తించారు. తల్లిదండ్రుల ప్రేమ, అక్కా చెల్లెళ్ల ప్రేమ, ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ ఇలా లవ్‌లో కూడా పలు రకాలు ఉంటాయి.

మెదడుపై ప్రభావం

అయితే చాలా రకాల ప్రేమ భావనలు మెదడులోని వేర్వేరు ప్రాంతాలను ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉదాహరణకు ప్రియురాలిపై కలిగే లవ్ ఫీలింగ్ మెదడులోని ఓ భాగాన్ని ప్రేరేపిస్తే.. తల్లిదండ్రులపై ప్రేమ మరో భాగాన్ని ప్రేరేపిస్తుందని అంటున్నారు. కాగా పేరెంట్స్‌పై ఉన్న ప్రేమను ఆయా సందర్భాల్లో ఫీల్ అయినప్పుడు అది మెదడులోపి భాగంలో ఉండే స్ట్రియాటమ్ ఏరియాను ప్రేరేపించడం ద్వారా మంచి అనుభూతిని కలిగిస్తుందట. ఇక ఇలాంటి ఫీలింగ్ ఇతర రకాల ప్రేమలో ఉండదని శాస్త్రవేత్తలు చెప్తు్న్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. మనుషులు తాము ఎక్కువగా ప్రేమించే వ్యక్తులను చూసినప్పుడు ఏర్పడే ఫీలింగ్‌తో పోలిస్తే కొత్త వ్యక్తులను చూసినప్పుడు ఏర్పడే ఫీలింగ్ డిఫరెంట్‌గా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed