- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆలుచిప్స్ లవర్స్‌కు భారీ షాక్..!!
దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్నాక్స్ ఇష్టంగా తింటున్నారు. ఈ ఉరుకుల పరుకుల జీవితంలో ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. కాగా కొంతమంది బిజీ లైఫ్ కారణంగా స్నాక్స్ ఇంట్లో తయారు చేయకుండా బయట షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆల చిప్స్ ఎక్కువగా తింటున్నారు. స్నేహితులతో కలిసి సరదాగా మాట్లాడుతున్నప్పుడు లేదా కలిసి సిట్టింగ్ వేసి మందు తాగేటప్పుడు చాలా మంది ఆలూ చిప్స్ తింటుంటారు. కాగా తరచుగా ఆలు చిప్స్ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజాగా ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.
ఆయిల్‌లో వేగించిన ఆహారాలలో ఎటువంటి పోషకాలు ఉండవు. చిప్స్‌లో హైఫ్యాట్ కెలోరీలు ఉంటాయి. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక బరువు ఊబకాయానికి దారి తీస్తుంది. ముఖ్యంగా బంగాళాదుంప చిప్స్ తింటే డేంజరస్ వ్యాధుల బారిన పడే చాన్స్ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో సోడియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి రక్తపోటు పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ కారణంగా హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాగా ఆరోగ్యం కాపాడుకోవాలంటే కూరగాయలతో చేసిన సలాడ్స్, సాండ్‌విజ్‌లు తీసుకుంటే ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు సూచిస్తున్నారు.