పిల్లలు వీడియో కాల్స్ మాట్లాడొచ్చు... కానీ..

by Sujitha Rachapalli |
పిల్లలు వీడియో కాల్స్ మాట్లాడొచ్చు... కానీ..
X

దిశ, ఫీచర్స్ : రెండేళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు స్క్రీన్ టైం అస్సలు ఉండకూడదని సూచిస్తున్నారు నిపుణులు. ఇది వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే వీడియో కాల్స్ మాత్రం మాట్లాడొచ్చని చెప్తున్నారు. ఇది కూడా ఒకరకమైన కమ్యూనికేషన్ గా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఒక చోట గ్రాండ్ పేరెంట్స్ మరోచోట ఉన్న పిల్లలకు ఇది చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఇక రెండేళ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు రోజుకి రెండు గంటలపాటు మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ అనుమతించొచ్చు అని చెప్తున్నారు నిపుణులు.

ఇక స్క్రీన్ టైం పూర్తిగా తగ్గించేందుకు స్క్రీన్ డిటాక్స్ మెయింటెయిన్ చేయాలని సూచిస్తున్నారు. బెడ్ రూం, లంచ్, డిన్నర్ టైంలో అస్సలు అలో చేయొద్దని.. లేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్, బ్రెయిన్, బంధాలపై కూడా ఈ ఎఫెక్ట్ పడుతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఫోన్లకు దూరంగా ఉంటే పిల్లలతో టైం స్పెండ్ చేస్తే.. స్క్రీన్ టైం అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. బయట పిల్లలతో ఆడుకోవడం వల్ల వారికి శారీరక శ్రమ పెరుగుతుందని.. ఉబకాయం, మధుమేహం లాంటి దీర్ఘకాలిక రోగాలు దరిచేరవని సూచిస్తున్నారు.

Advertisement

Next Story