- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే సక్సెస్ మీ సొంతం...
దిశ, ఫీచర్స్ : గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ తగినంత ఫోకస్ లేకపోతే టార్గెట్ రీచ్ కాలేమన్న విషయం అందరికి తెలుసు. అందుకే కొంత మంది ఆ రేస్ నుంచి తప్పుకుని ప్రైవేట్ జాబ్స్ వెతుక్కుంటే.. ఇంకొందరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతారు. కానీ ఈ జర్నీ చాలెంజింగ్ గా ఉంటుంది. కొద్దిసార్లు ఫోకస్ తప్పుతుంది. అలా కాకుండా ఉండేందుకు నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేసి జాబ్ పొందేందుకు సహాయం చేస్తుందని అంటున్నారు.
రియలిస్టిక్ స్టడీ ప్లాన్
సిలబస్‌ను కొన్ని భాగాలుగా విభజించి.. డైలీ, వీక్లీ, మంత్లీ టార్గెట్స్ సెట్ చేయండి. దీనివల్ల మనం పోర్షన్ కంప్లీట్ చేయడంతోపాటు ఉత్సాహం పెరుగుతుంది. మరింత చదవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది.
పోమోడోరో టెక్నిక్
25 నిమిషాలు చదువుకుని.. ఆపై 5 నిమిషాల విరామం తీసుకోండి. ఇలా నాలుగు సార్లు అయిపోయాక.. ఎక్కువ సేపు బ్రేక్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఎక్కువగా ఫోకస్ చేసేందుకు సహాయపడుతుంది, అలసటను తగ్గిస్తుంది. ప్రొడక్టివిటీ పెంచుతుంది.
రీకాల్ అవసరం
ప్రతి చాప్టర్ చదివాక మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఫ్లాష్‌కార్డ్‌లను ఉపయోగించి కష్టమైన అంశాలను క్రమం తప్పకుండా చదవండి. దీనివల్ల జ్ఞాపక శక్తి
బలపడుతుంది. సమాచారం ఎక్కువసేపు గుర్తుండేందుకు సహాయపడుతుంది.
నేర్చుకున్నది చెప్పండి
మీరు నేర్చుకున్న టాపిక్ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్లకు ఎక్స్ ప్లెయిన్ చేయండి. ఇలా చేయడం మీరు నాలెడ్జ్ ఆర్గనైజ్ చేసేందుకు హెల్ప్ చేస్తుంది. ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
విజువలైజేషన్
మీరు చదివిన టాపిక్ ను ఫ్లో చార్ట్స్, మైండ్ మ్యాప్, రేఖా చిత్రాలుగా డిజైన్ చేసుకోండి. విజువల్ అండర్ స్టాండింగ్.. రీకాల్ ను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కష్టమైన అంశాల్లో ఇలా చేయడం మీకు చాలా హెల్ప్ అవొచ్చు.
మాక్ టెస్ట్
మనం ఫేస్ చేయబోయే ఎగ్జామ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు క్రమం తప్పకుండా మాక్ టెస్ట్ ట్రై చేయండి. దీనివల్ల ఎగ్జామ్ పాటర్న్ పై అవగాహన, టైమ్ మేనేజ్మెంట్ తో పాటు ఎక్కడ వీక్ గా ఉన్నామో తెలిసిపోతుంది.
టోటల్ టాపిక్ పై అవగాహన
కాన్సెప్ట్ మాత్రమే గుర్తుపెట్టుకునే బదులు దాని వెనుక ఉన్న పూర్తి డిటైల్స్.. ఎందుకు, ఎలా అనేది తెలుసుకుంటే ఎగ్జామ్ లో చాలా సహాయంగా ఉంటుంది. ఎందుకంటే పోటీ పరీక్షలు తరుచుగా అప్లికేషన్ బేస్డ్ అండర్ స్టాండింగ్ గురించి పరిక్షిస్తాయి. కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం కాన్సెప్టు గురించి పూర్తిగా తెలిసి ఉండాలి.
నోట్.. పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకోబడింది...
Read More...
ఆరేళ్లుగా ఉద్యోగానికే పోలేదు.. కానీ అవార్డు విన్నర్ ఆయనే..