- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెల్తీ లైఫ్ స్టైల్ కావాలా?.. అయితే నైట్‌టైమ్ ‘రొటీన్స్’ మార్చుకోండి!
దిశ, ఫీచర్స్: మనుషులు వివిధ అవాట్లను కలిగి ఉండటమే కాకుండా, కొత్త కొత్త వాటిని కూడా క్రియేట్ చేసే నైపుణ్యం, సామర్థ్యం కలిగి ఉంటారు. అందుకే ఆరోగ్య కరమైన జీవనశైలి కోసం ఇబ్బందికరమైన అవాట్లను వదులుకోవాలి. ముఖ్యంగా ప్రతి రోజూ నిద్రపోయేకంటే గంట ముందు మన మెదడు అవసరంలేని రొటీన్స్‌ను గుర్తించి నివారించగలిగేలా క్వాలిటీ స్లీప్, టైమ్ మేనేజ్ మెంట్ వంటి హెల్తీ హాబిట్స్ అలవర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మనం ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు సరైన నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేకపోతే మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
వీటికి దూరంగా ఉండండి
మీరు నాణ్యమైన నిద్రను ఒక అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందుకోసం నిద్రకు భగం కలిగించే పరిస్థితులను నివారించాలి. ముఖ్యంగా ప్రతిరోజూ రాత్రిపూట పడుకోవడానికి ఒక గంట ముందు కంప్యూర్, టీవీ, స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ వంటి ఎలక్ర్టానిక్ పరికరాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి బలమైన నీలి కాంతిని విడుదల చేస్తాయి. కాబట్టి ఈ వీటిని ఉపయోగించినప్పుడు వాటి స్ర్కీన్ నుంచి వెలువడే నీలి కాంతి (blue light) మెదడుపై ఎఫెక్ట్ చూపుతుంది. ఇది పగటిపూట అనే విధంగా యూజర్ బ్రెయిన్ భావించేలా ప్రభావితం చేస్తుంది. ఈ విధమైన సంకేతల నేపథ్యంలో మెదడులో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి ఆటకం కలిగి, మెలకువగా ఉండేలా ప్రేరేపిస్తుంది.
హెల్తీ ఫ్యాట్స్ తినండి
మీ హార్మోన్ల అసమతుల్యతను, డయాబెటిస్ సమస్యలను నివారించడానికి, అధిక బరువు తగ్గడానికి ప్రతి రోజూ ఉదయం హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి శరీర ప్రతిస్పందనను మెరుగుపరచడమే కాకుండా, హంగర్ ఎపిసోడ్స్‌ను, రకరకాల ఆహారాలు తినాలనే కోరికలను తగ్గిస్తాయి. హెల్తీ ఫ్యాట్స్‌లో కార్బోహైడ్రేట్ ఉండకపోవడంవల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్ పెరగదు. అదనంగా ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది.
ప్రతీరోజూ ప్లాన్‌తో ఉండండి
అనవసర ఆందోళన దూరం కావాలంటే ప్రతిరోజూ మీరు చేయాల్సిన పనుల జాబితాను రూపొందించుకోండి. దీనివల్ల మీ మనస్సు రేపటి పనుల గురించి అతిగా ఆలోచించకుండా, ఆందోళన చెందకుండా ఉండేందుకు దోహదం చేస్తుంది. మీరు ఉదయం మేల్కొన్నప్పుడు, ఆరోజును ప్రారంభించడానికి సరైన ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. ప్రతి రోజు సాయంత్రం 15 నుంచి 30 నిమిషాలు మరుసటి రోజు కోసం సిద్ధం చేయడంవల్ల కూడా మరుసటిరోజు ఎంతో ఉత్సాహంగా కొనసాగుతుంది. మీరు పడుకున్నప్పుడు మనశ్శాంతిని పెంపొందించుకోవచ్చు.
స్ట్రెస్‌ను తగ్గించుకోండి
మీరు ఉత్సాహంగా ఉండేందుకు ఒక కార్యాచరణను ఎంచుకోండి. ఉదాహరణకు మెడిటేషన్, బ్రీతింగ్, బుక్ రీడింగ్, లైట్ మ్యూజిక్, లేదా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం వంటివి చేయండి. ఇటువంటి అలవాటు కారణంగా మీలో స్ట్రెస్ తగ్గుతుంది. మనస్సు రిలాక్సేషన్ లభించడంవల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. వివిధ టెన్షన్స్ నుంచి ఉపశమనం కలగుతుంది. క్వాలిటీ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రతీ ఉదయం మొదలు రాత్రి వరకు మీరు ఫ్రెష్‌గా ఎనర్జిటిక్‌గా ఉండగలుగుతారు. ఆరోగ్యంగా, ప్రొడక్టివ్‌గా, యాక్టివ్‌గా ఉన్నట్లు అనుభూతి చెందడం ప్రారంభిస్తారు.
Read More: విస్కీ, బీర్ కలిపి తాగుతున్నారా.. అయితే ఈ ఇబ్బందులు తప్పవు?
మటన్, చికెన్ తిన్న తర్వాత ఈ మూడు తింటున్నారా..! అయితే ప్రమాదంలో పడినట్లే..!