- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AC Alert : ఎక్కువసేపు ఏసీలో ఉంటే కిడ్నీలు పాడవుతాయి !.. శరీరంలో ఇంకా ఏం జరుగుతుందంటే..
దిశ, ఫీచర్స్ : ఏసీ వాడకం ఇప్పుడు చాలామంది జీవితాల్లో భాగమై పోయింది. కొందరు సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పుడూ వాడుతుంటారు. మరికొందరు సమ్మర్‌లో మాత్రమే ఉక్కబోతలు తట్టుకోలేక వాడుతుంటారు. ఇక ఆఫీసుల్లో అయితే ఎండాకాలం వచ్చిందంటే చాలు తప్పకుండా ఏసీ వాడుతుంటారు. బయటి నుంచి రాగానే కాసేపు చల్లగా సేద తీరాలనిపించి ఎయిర్ కండిషనర్ ఆన్ చేసుకోవడం సహజం. కానీ అసలు విషయం తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఏసీలో ఉండటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. సైంటిఫిక్ ఆధారాలు అయితే లేవు కానీ, ఏసీ వాడకం పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్‌తో పాటు కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతుందనే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అవేంటో చూద్దాం.
తరచుగా ఎయిర్ కండిషనర్ల కూలింగ్‌కు గురికావడంవల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ముఖ్యంగా ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు ఆ చల్లదనం కారణంగా గదిలో సహజంగా ఉండే తేమ ఆవిరైపోతుంది. అక్కడున్న వ్యక్తుల శరీరంపై తేమ కూడా లేకుండా పోయి డ్రైగా మారుతుంది. కళ్లు కూడా పొడిబారి దురద పెట్టే చాన్స్ ఉంటుంది. ఎక్కువగా ఏసీకి అలవాటు పడినవారు బయటి వాతావరణంలో సహజంగా వచ్చే క్లైమేట్ చేంజెస్ మార్పులను తట్టుకోలేరు. దీని కారణంగా వారిలో తలనొప్పి, అలెర్జీలు వంటివి వస్తుంటాయి.
రోజూ ఒక గంటకంటే ఎక్కువగా ఏసీలో ఉండే వారు సహజంగానే త్వరగా అలసిపోతారట. కొందరికి శ్వాసకోశ సమస్యలు తలెత్తవచ్చు. ఏసీ పడకపోవడంవల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫీవర్ వచ్చే చాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఏసీలు గాలిలోని తేమను పీల్చుకుంటాయి కాబట్టి కొన్నిసార్లు ఏసీ పడనివారు డీహైడ్రేషన్ బారిన పడవచ్చు. దీర్ఘకాలంగా ఏసీలో ఉండటంవల్ల చల్లగా అనిపించి దాహం వేయదు. దీంతో చాలామంది నీళ్లు తాగరు. ఫలితంగా ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. అనుకోకుండా డీహైడ్రేషన్ సంభవించి కిడ్నీలు దెబ్బతినవచ్చు. అందుకే పరోక్షంగా ఏసీవల్ల కిడ్నీలు పాడయ్యే చాన్స్ ఉందని చెప్తుంటారు.
ఇలా చేయడం బెటర్
ప్రస్తుతం ఏసీ వాడకం కామన్ అయిపోయింది. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి తట్టుకోవడానికి పట్టణ ప్రజలకు అందుబాటులో ఉన్న కంఫర్టబుల్ ప్రత్యామ్నాయం కూడా ఇదే. ఈ నేపథ్యంలో అనారోగ్యాలకు గురికాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏంటంటే ఎక్కువ సమయం ఏసీ ఆన్‌లో ఉండచకూడదు. కాసేపు వేశాక ఆఫ్ చేస్తే అప్పటికే ఏర్పడిన కూలింగ్ సరిపోతుంది. అలాగే ఏసీ టెంపరేచర్‌కు, బయటి ఉష్ణోగ్రతకు మధ్య ఎక్కువ వ్యత్యాసం లేకుండా చూసుకోవాలి. సుమారు ఐదారు డిగ్రీలకు మించి తేడా లేకుండా చూసుకోవాలి. అంటే బయట 34 డిగ్రీల సెల్సియస్ ఉంటే.. ఏసీ ఉష్ణోగ్రతను 28 డిగ్రీలకు మించి తగ్గించ కూడదు.