- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Baby Food : 6 నెలల తర్వాత శిశువుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలుసా..
దిశ, వెబ్‌డెస్క్ : పుట్టిన తర్వాత బిడ్డకు మొదటి 6 నెలలు తల్లి పాలు మాత్రమే ఇస్తారు. కానీ ఈ కాలం తర్వాత పిల్లల కడుపు కేవలం తల్లి పాలతో మాత్రమే నిండదు. అలాంటప్పుడు పిల్లలకు తల్లి పాలతో పాటు ఆహారం కూడా ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది పిల్లల మానసిక వికాసాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందంటున్నారు.
పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆహారంలో రోటీ, పప్పు లేదా సాధారణ భోజనం తినిపించేందుకు ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు పిల్లలు తినడానికి అస్సలు ఇష్టపడరు. దీంతో మంచి పౌష్టికాహారం పిల్లలకు ఎలా ఇవ్వాలో తెలియక తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే పీడియాట్రిక్ స్పెషలిస్టులు తల్లిదండ్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. 6 నెలల తర్వాత పిల్లలకు ఏమి తినిపించాలి, ఏ పరిమాణంలో తినిపించాలో సలహాలు ఇస్తున్నారు.
శిశువుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి...
6 నెలల తర్వాత పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడేందుకు కిచిడీ, మినుములు, రాగులతో చేసిన వాటిని ఆహారంలో ఇవ్వడం మంచిదంటున్నాను నిపుణులు.
6 నుండి 10 నెలల శిశువుకు రోజుకు రెండుసార్లు ఆహారం ఇవ్వలాని చెబుతున్నారు.
10 నుండి 12 నెలల శిశువుకు తప్పనిసరిగా రోజుకు 3 సార్లు ఫుడ్, 2 సార్లు స్నాక్స్ తినిపించాలని చెబుతున్నారు.
అలాగే, 12 నెలల తర్వాత బిడ్డలకు క్రమం తప్పకుండా ఆహారం ఇవ్వడం ప్రారంభించాలంటున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం 1 సంవత్సరం వయస్సు తర్వాత పిల్లల చిగుళ్ళు బలంగా మారుతాయి. అప్పుడు ఫింగర్ ఫుడ్ తినిపించేలా చూసుకోండి. ఫింగర్ ఫుడ్ తినడం ద్వారా పిల్లలు ఆహారాన్ని సరిగ్గా నమలడం నేర్చుకుంటారు.
బీన్స్, పప్పులు..
6 నెలల తర్వాత పిల్లల ఆహారంలో బీన్స్, పప్పులను చేర్చాలని చెబుతున్నారు. బీన్స్‌లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. పప్పులు తినడం వల్ల పిల్లలకు తగిన మోతాదులో ప్రొటీన్లు అందుతాయని చెబుతున్నారు.
నీళ్లు కూడా ముఖ్యమే..
అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే 6 నెలల శిశువుకు నీళ్లు తాగించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు డీ హైడ్రేషన్ సమస్య ఉండదంటున్నారు. ఫుడ్ తీసుకున్న తర్వాత పిల్లలకి 1 నుంచి 2 స్పూన్ల నీళ్లు తాగించాలని చెబుతున్నారు.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.