క్యాన్సర్‌ను కోరి తెచ్చుకుంటున్నామా?.. రోజూ వాడే వస్తువులతోనే పొంచి ఉన్న ముప్పు !

by Dishafeatures2 |
క్యాన్సర్‌ను కోరి తెచ్చుకుంటున్నామా?.. రోజూ వాడే వస్తువులతోనే పొంచి ఉన్న ముప్పు !
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేక మందిని వేధిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. కణ విభజన అదుపు తప్పడంవల్ల ఇది వస్తుంది. శరీరంలోని ఏ భాగంలో అయినా రావచ్చు. మారుతున్న జీవన శైలి, వాతావరణ కాలుష్యం, జన్యు సంబంధిత లోపాలు, రసాయనాలకు గురికావడం వంటి రకరకాల కారణాలతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా మనం రోజువారీగా ఇంట్లో వాడే కొన్ని రకాల వస్తువులు, గృహోపకరణాల్లో ఆస్బెస్టాస్, వినైల్ క్లోరైడ్, బెంజీన్, ఆర్సెనిక్, రాడాన్, ట్రైక్లోరెథైలీన్ వంటి టాక్సిక్ పదార్థాలు ఉంటాయి. వీటికి గురికావడంవల్ల క్యాన్సర్ వస్తుందని స్వీడన్‌లోని ఓ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అంకాలజిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. అటువంటి క్యాన్సర్ కారకాలేవో చూద్దాం.

గోడలకు వాడే రంగులు

గోడలు అందంగా కనిపించడానికి వివిధ రకాల పెయింటింగ్స్, వార్నిష్‌లు వాడుతుంటారు. ఈ లిక్విడ్స్‌లో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే బెంజీన్, ఫార్మాల్డిహైడ్, టోల్యూన్ వంటి కెమికల్స్ మిక్స్ అయి ఉంటాయి. తరచుగా వీటికి గురికావడంవల్ల క్యాన్సర్ బారిన పడే చాన్స్ ఉంటుంది.

టెఫ్లాన్ కోటెడ్ వంట పాత్రలు

ఆధునిక జీవన విధానం సౌకర్యవంతంగా అనిపిస్తుంది. కానీ కొన్ని సమస్యలకు కూడా కారణం అవుతోంది. వంట ఫాస్ట్‌గా అవ్వాలని ప్రజెంట్ చాలామంది నాన్ స్టిక్ కుక్ వేర్స్ వాడుతున్నారు. మన ఇండ్లల్లో ప్రతిరోజూ దేశ వేసే పెనం అదే అయి ఉంటుంది. అలాగే టెఫ్లాన్ కోటెడ్ కలిగిన వివిధ పాత్రలు నాన్ స్టిక్‌ పాత్రల వాడకం ఇప్పుడు కామన్ అయిపోయింది. వాస్తవానికి నాన్ స్టిక్ పెనం, కడాయి వంటివి స్టౌమీద వేడి చేస్తున్నప్పుడు హానికరమైన పెర్‌ ఫ్లోరినేటెడ్ అనే కెమికల్స్‌ను రిలీజ్ చేస్తాయి. ఇవి మనం తినే ఆహారాల్లో కలిసిపోయి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సిరామిక్, కా్ట్ ఐరన్ పాత్రలతో ఇటువంటి ముప్పు ఉండదు.

ప్లాస్టిక్ కవర్లు

పండ్లు, కూరగాయలు, వివిధ ఆహార పదార్థాలను తీసుకొచ్చేందుకు, స్టోర్ చేసేందుకు మనం ప్లాస్టిక్ కవర్లను వాడుతుంటాం. స్వీట్లు కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో పెడుతుంటాం. కానీ వీటిలో థాలేట్స్, బిస్‌ఫినాల్ వంటి కెమికల్స్ ఉండవచ్చు. ఇవి క్యాన్సర్ కారకం. కాబట్టి స్టెయిన్ లెస్ స్టీల్ కంటైనర్లు, గాజు పాత్రల వాడటంవల్ల మేలు జరుగుతుంది.

క్లీనింగ్ లిక్విడ్స్

ప్రతిరోజూ ఇంటిని క్లీన్ చేయడానికి బయట మార్కెట్‌లో దొరికే వివిధ రకాల లిక్విడ్స్ వాడుతుంటాం. కానీ వీటిలో అమ్మోనియా, క్లోరిన్ బ్లీచ్, ఫార్మాల్డీహైడ్ వంటి క్యాన్సర్ కారకారక కెమికల్స్ ఉంటాయి. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడా, వెనిగర్ వంటివి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

బర్త్ డే క్యాండిల్స్

ప్రజెంట్ బర్త్ డే పార్టీలు క్యాండిల్ వెలిగించి ఊదనిదే జరగడం లేదు. అలాగే ఇండ్లల్లో కరెంట్ పోయినప్పుడు వెలిగించడానికి కూడా కొవ్వత్తులను యూజ్ చేస్తుంటాం. కానీ ఇలా క్యాండిల్స్ వెలిగించినప్పడు టోలున్, బెంజీన్ వంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయట. అందుకే ప్రత్యామ్నాయాలు చూసుకోవడం బెటర్.

పెప్టిసైడ్స్

పంట పొలాలు, గార్డెన్‌లోని మొక్కలకు తెగుళ్లు, చీడ పీడల నివారణకు పెప్టిసైడ్స్ యూజ్ చేస్తుంటారు. వీటిలో హానకరమైన రసాయనాలు ఉంటాయి. ముఖ్యంగా లుకేమియా, లింఫోమా వంటి కెమికల్స్ ఉండటంవల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతాయి. జాగ్రత్తలు పాటించడం, సేంద్రియ పద్ధతులు అవలంభించడం ప్రత్యామ్నాయంగా నిపుణులు పేర్కొంటున్నారు.

రేడియేషన్ ఎక్స్‌పోజర్

ఈరోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకుండా ఎవరూ ఉండటం లేదు. వీటివల్ల సౌకర్యాలు, ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైన నష్టాలు కూడా ఉన్నాయి. దీర్ఘకాలంపాటు ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వెలువడే రేడియేషన్స్‌కు గురికావడంవల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే పడుకునే ముందు సెల్‌ఫోన్లను, ఇయర్ బడ్స్‌ను స్విచ్ ఆఫ్ చేయడం, దూరంగా పెట్టడం వంటివి చేయాలని నిపుణులు చెప్తున్నారు.

Next Story

Most Viewed