- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒకే పేరుతో ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీకి వద్దనలేం: సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల బరిలో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలని వేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజకీయ నాయకుల పేర్లతో ఉన్న వ్యక్తులు స్వతంత్రంగా పోటీ చేయడాన్ని తాము నిలువరించలేమని పేర్కొంది. ఏదైనా నియోజకవర్గంలో ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులను పోటీకి అనుమతించకుండా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని సాబు స్టిఫెన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కొన్ని ప్రధాన నియోజకవర్గాల్లో ఓటర్లను తప్పుదోవ పట్టించడానికి ముఖ్యమైన నేతల పేర్లతో కొందరు పోటీలో నిలబడుతున్నారని, పోటీ అభ్యర్థి అవకాశాలను దెబ్బతీసేందుకు అదే పేరుతో ఉన్న వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉంచుతున్నారని పిటిషనర్ వివరించారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల ప్రక్రియ కోసం ఈ ధోరణిని ఆపడానికి తక్షణ చర్యలు తీసుకునేలా భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. అయితే, పిటిషన్‌ను పరిశీలించిన అత్యున్నంత న్యాయస్థానం విచారణకు నిరాకరించింది. 'అభ్యర్థుల పేర్లను వారి తల్లిదండ్రులే పెట్టినప్పుడు, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా అడ్డుకోగలమని, రాహుల్ గాంధీ, లాలూప్రసాద్ యాదవ్‌లాగా ఎవరైన పేర్లను పెట్టుకుంటే ఎన్నికల్లో నిలబడకుండా ఎలా ఆపగలమని' జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. అనంతరం అభ్యర్థనను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్‌కు సుప్రీంకోర్టు అనుమతించింది.