టెడ్డీని హగ్ చేసుకోవడంవల్ల స్ట్రెస్ రిలీఫ్.. పిల్లల్లో, పెద్దల్లో కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే..

by Javid Pasha |
టెడ్డీని హగ్ చేసుకోవడంవల్ల స్ట్రెస్ రిలీఫ్.. పిల్లల్లో, పెద్దల్లో కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే..
X

దిశ, ఫీచర్స్: టెడ్డీబేర్స్ అంటే జస్ట్ పిల్లలు ఆడుకోవడానికి పనికొచ్చే బొమ్మలు అనుకుంటాం. కానీ.. వీటివల్ల పిల్లలతోపాటు పెద్దలకు కూడా బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. ఒకప్పుడు పిల్లలు మాత్రమే వీటితో ఆడుకునేవారు. ప్రస్తుతం పెద్దలు, యువతీ యుకులు కూడా యూజ్ చేస్తున్నారు. తమ బెడ్ రూముల్లో నచ్చిన టెడ్డీని పెట్టుకుంటున్నారు. పడుకునేటప్పుడు వాటిని హత్తుకొని నిద్రపోతున్నారు. ఇది ఎంతోమందిలో స్ట్రెస్ రిలీఫ్‌కు కారణం అవుతోంది. ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. అంతేకాకుండా టెడ్డీలు ఇప్పుడు ప్రజల భావోద్వేగాలతో అనుబంధం కలిగి ఉంటున్నాయని ఫ్రాన్స్‌లోని ఐక్స్-మార్సెయిల్ యూనివర్సిటీ నిపుణుల అధ్యయనంలోనూ వెల్లడైంది. వారి ప్రకారం ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.

* టెడ్డీలను ప్రజలు ఎలా అంచనా వేస్తున్నారో తెలుసుకోవడానికి రీసెర్చర్స్ 300 కంటే ఎక్కువ మందిని సర్వేచేశారు. ఈ సందర్భంగా వారు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తించారు. ఏంటంటే.. టెడ్డీ బేర్లు ప్రజల ఎమోషన్స్‌తో ముడిపడి ఉంటున్నాయి. వాటి అందం, ఆకారం, రూపు రేఖల ఆధారంగా పిల్లలతోపాటు పెద్దలు కూడా ఇష్టపడుతున్నారు. పిల్లలు వీటితో ఆడుకుంటున్నప్పుడు, హగ్ చేసుకొని పడుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలవుతుంటారు. దీంతో పిల్లల మెదడులోని న్యూరాన్స్‌లో పాజిటివ్ యాక్టివేషన్స్ ఏర్పడి ఆక్సిటోసిన్ వంటి హ్యాపీనెస్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి పిల్లల మానసిక, శారీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

* టెడ్డీలను రాత్రిపూట హగ్ చేసుకొని పడుకోవడంవల్ల చాలామంది కంఫర్ట్‌గా ఫీలవుతున్నారు. ఈ పరిస్థితి యువతీ యువకుల్లో వారిని ఒత్తిడికి గురిచేసే కార్టిసోల్ హార్మోన్ రిలీజ్‌ను అడ్డుకుంటోంది. ఇక పెద్దల విషయానికి వస్తే పలువురు టెడ్డీలను హగ్ చేసుకోవడం లేదా వాటిని తరచుగా తమ బెడ్ రూముల్లో ఉంచుకోవడంవల్ల ఒత్తిడి, ఒంటరితనం, విచారం వంటి భావాలకు దూరంగా ఉండగలుగుతున్నారు. అంతేకాకుండా టెడ్డీబేర్ల సున్నితమైన స్పర్శ అనేకమందిలో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలకు కారణం అవుతోంది.

* భావోద్వేగాల నియంత్రణలోనూ టెడ్డీలు కీ రోల్ పోషిస్తున్నాయి. టీనేజర్లు, చిన్న పిల్లలు, పెద్దలు ఇటీవల తమకు కోపం వచ్చినా, సంతోషం కలిగినా ఇండ్లల్లో ఉన్నప్పుడు టెడ్డీబేర్లను హగ్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇది ఎమోషన్స్ కంట్రోల్ చేయడంలో ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు. కేవలం అంకరణలు, గిఫ్టులుగా మాత్రమే కాకుండా టెడ్డీలు నేడు మానవుల్లో సామాజిక, భావోద్వేగ అనుబంధాన్ని ప్రేరేపిస్తున్నాయి, వాటిని హగ్ చేసుకోవడంవల్ల అనారోగ్యం, బాధల నుంచి కోలుకునేలా చేస్తున్నాయి. అందుకే నచ్చిన టెడ్డీబేర్‌తో గడపడం కూడా మానసిక వికాసానికి దోహదం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed