- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగుతున్నాయా?.. కంట్రోల్లో ఉండాలంటే తినాల్సిన ఆహారాలు ఇవే..
దిశ, ఫీచర్స్ : మారుతున్న జీవన శైలి, తినే ఆహారాలు కూడా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా టైప్ -2 డయాబెటిస్, హార్ట్ రిలేటెడ్ రిస్క్ పెరగడానికి ఆయిలీ ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఎక్కువగా వేయించిన పదార్థాలు వంటివి కూడా కారణం అవుతున్నాయి. అదే సందర్భంలో ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడం, ఎక్కువసేపు ఒకేచోట కూర్చొని పనిచేయాల్సి రావడం కూడా ఎఫెక్ట్ చూపుతన్నాయి. అయితే కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దోహదపడతాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.
బచ్చలికూర, మునగాకు
చాలామందికి బచ్చలి కూర అద్భుతాలు చేస్తుందని తెలియదు. కానీ డయాబెటిస్‌ను నివారించగలిగే పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఫైబర్ కంటెంట్, ఐరన్ లెవల్స్ అధికస్థాయిలో ఉండి, కార్బోహైడ్రేట్స్ తక్కువ స్థాయిలో ఉండటంవల్ల బచ్చలి కూర బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. కాబట్టి ఆహారంలో భాగంగా దీనిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మునగాకును కూరగా వండుకుని తినడంవల్ల మధుమేహాన్ని అదుపు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్ అధికంగా ఉంటాయి. ఆహారంలో చేర్చడంవల్ల రక్తంలో చక్కెరస్థాయిలు తగ్గుతాయి.
బ్రోకలీ..
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కూరగాయల్లో బ్రోకలీ ఒకటి. ఇది అద్భుతమైన పోషకాల వనరుగా నిపుణులు చెప్తుంటారు. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం మూలంగా చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది. డయాబెటిస్ పేషెంట్లలో ఇబ్బందులను తగ్గించడంలో ముఖ్యంగా రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడంలో బ్రోకలీ అద్భుతంగా పనిచేస్తుంది.
బొప్పాయి, కీరదోస
బొప్పాయి తింటే వేడి చేస్తుందని కొందరు అంటుంటారు. కానీ నిజం కాదు. దీనివల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడంలో బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండటంవల్ల ఈ పండు, కాయ, ఆకులు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. షుగర్ పేషెంట్లు వారంలో కనీసం నాలుగు సార్లు బొప్పాయి పండు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కలిగిన మరో అద్భుత వనరు కీరదోస. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి. సమ్మర్‌లో కీరదోస తినడం ఆరోగ్యానికి మరింత మంచిది. దీంతోపాటు టొమాటోలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.
Read More..
వెల్లుల్లి రసంతో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?