Drink it or not ? : ఎక్కువైతే నష్టం..! తక్కువైతే లాభం!!

by Javid Pasha |   ( Updated:2025-03-20 14:56:44.0  )
Drink it or not ? : ఎక్కువైతే నష్టం..! తక్కువైతే లాభం!!
X

దిశ, ఫీచర్స్ : చాయ్ లేదా టీ (Tea) తాగడాన్ని ప్రంపంచ వ్యాప్తంగా చాలామంది ఇష్టపడతారు. కొందరికైతే ఉదయం పూట టీ తాగనిదే ఏమీ తోచదు. అయితే దీనిని పరిమితంగా తాగితే చురుగ్గా ఉంటారు. కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అతిగా తాగితేనే నష్టం అంటున్నారు నిపుణులు.

లాభాలు

*చాయ్‌లో ఫాలీ ఫెనాల్స్ (Polyphenols) వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి కణాలను రక్షిస్తాయి. క్యాన్సర్, ఒబేసిటీ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కొంత వరకు నివారిస్తాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

*ఇక గ్రీన్‌ టీలో ఉండే కాటెచిన్స్ (Catechins) బాడీలో ఆక్సీకరణ ఒత్తిడి(Oxidative stress)ని తగ్గిస్తాయి. టీలోని కెఫిన్ మెదడును ఉత్తేజ పరిచి ఏకాగ్రతను, చురుకు దనాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే ఎల్-తియనైన్(L-Theanine) అనే అమైనో యాసిడ్ మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

*బ్లాక్ టీ, గ్రీన్ టీలలో ఉండే ఫ్లేవనాయిడ్స్(Flavonoids) గుండె జబ్బుల రిస్కును తగ్గిస్తాయి. రక్త నాళాల పనితీరును మెరుగు పరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌(LDL) స్థాయిలను తగ్గించడంలో సహఆయపడతాయి. ఇక గ్రీన్ టీలో యాంటీ బ్యాక్టరియల్ అండ్ యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సాధారణ జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

*ఒక పిపరమెంట్ టీ, జింజర్ టీ వంటి మూలికా పానీయాలు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఇవి కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తాయి. గ్రీన్ టీ మెటబాలిజాన్ని పెంచి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. కామోమైల్ అనే హెర్బల్ చాయ్ నిద్రను మెరుగు పరుస్తుంది.

నష్టాలు

*టీ పరిమితంగా తాగితే మేలు చేస్తున్నట్లు అతిగా తాగితే హాని కూడా చేస్తుంది. రోజుకు మూడు లేదా నాలుగు కప్పులకు మించి తాగితే నష్టమే. ఇందులో కెఫిన్ అధికమైతే నిద్రలేమి, ఆందోళన, తలనొప్పి, గుండె దడ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే రోజుకు 400 మి. గ్రా. కంటే ఎక్కువ (సుమారు 4 నుంచి 5 కప్పులు)తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

*చాయ్ లో ఉండే టాన్సిన్స్ (Tannins) ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. భోజన సమయానికి ముందు లేదా భోజనం చేయగానే వెంటనే టీ తాగితే రక్తహీనత (ఎనీమియా) రిస్క్ పెరుగుతుంది. అట్లనే ఖాళీ కడుపుతో అధికంగా టీ తాగితే ఎసిడిటీ, కడుపులో మంట, హార్ట్ బర్న్ వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. బ్లాక్ టీలోని టానిన్స్ దంతాలపై మరకలకు, దీర్ఘకాలంలో పళ్లు పసుపు రంగులోకి మారడానికి కారణం అవుతాయి.

*ఎక్కుసార్లు లేదా ఎక్కువగా టీ తాగితే కెఫిన్ అనే పదార్థం శరీరంలో కాల్షియం శోషణను తగ్గిస్తుంది. ఎముకల బలహీనత (ఆస్టియో పోరోసిస్)కు దారితీయవచ్చు. ఇక పాలు, టీ పొడి, చక్కెరి కలిపి తయారు చేసే చాయ్ అధికంగా తాగడంవల్ల అది అధిక కేలరీలను అందిస్తుంది. అధిక బరువుకు దారితీయవచ్చు. అట్లనే రోజూ ఎక్కువసార్లు టీ తాగడం ఒక వదులుకోలేని అలవాటుగా మారి అడిక్షన్‌గా మారవచ్చు. అందుకే రోజుకు 2 నుంచి మూడు కప్పుల వరకు తాగడం మాత్రమే సురక్షితం అంటున్నారు నిపుణులు.

READ MORE ...

New study : వారానికి రెండుసార్లు ఇవి తింటే.. ఆ రిస్క్ ఉండదంటున్న నిపుణులు!







Next Story

Most Viewed