- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Foods ease anxiety & Stress: స్ట్రెస్, యాంగ్జైటీతో ఇబ్బందిపడుతున్నారా? వాటిని దూరం చేసే ఆహారాలివే
దిశ, ఫీచర్స్ : మనం తినే ఆహారాలు నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా? అలా చేయడంవల్లే రోజంతా ఎంత రిలాక్సేషన్‌గా అనిపించడమో, యాంగ్జైటీని, స్ట్రెస్‌ను అనుభవించడమో జరుగుతుందని డైటీషియన్లు చెప్తున్నారు. తరచుగా హై షుగర్ లెవల్ కలిగినవి, అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతాయి. ఇవి సాధారణంగా ఆందోళన, ఒత్తిడిని ప్రోత్సహిస్తాయి. అలాగే మనం తీసుకునే మరొకొన్ని ఆహారాలు, పండ్లు ఒత్తిడిని దూరం చేస్తాయి. అలాంటి ఆహారాలేవో తెలుసుకుందాం.
అశ్వగంధ, బాదం పప్పులు
ఒత్తిడిని తగ్గించడంలో అశ్వగంధ, బాదం పప్పులు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. నిద్రవేళకు ముందు అశ్వగంధ టీ తాగడం నరాలను ఉత్తేజ పరుస్తుంది. మనశ్శాంతికి దోహదం చేస్తుంది. అలాగే నాణ్యమైన నిద్రను ప్రేరేపిస్తుంది. నెగెటివ్ థాట్స్‌ను దూరం చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఈ ఔషధ మూలిక స్ట్రెస్‌కు కారణమయ్యే కార్టిసాల్ హార్మెన్ లెవల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక బాదం పప్పులు కూడా యాంగ్జైటీని దూరం చేస్తాయి. వీటిలో విటమిన్ బి2, విటమిన్ ఇ, మెగ్నీషియం అండ్ జింక్ వంటి పోషకాలు ఉండటంవల్ల ఒత్తిడిని తగ్గిస్తాయి. మనుషుల్లో సంతోషానికి కారణమయ్యే సెరోటోనిన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి.
మిల్క్, అరటి, చమోమిలే టీ
ఆవు పాలల్లో A1, A2 ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిలో A2 ప్రోటీన్‌లో విటమిన్ E , బీటా కెరోటిన్ వంటి లాభదాయకమైన యాంటీ ఆక్సిడెంట్లను అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇక చమోమిలే అనేది ప్రశాంతతకు పర్యాపదంగా ప్రఖ్యాతి గాంచిన ఒక పువ్వు. దీనిద్వారా తయారు చేసే చమోమిలే టీ శరీరంలో సెరోటోనిన్ అండ్ మెలటోనిన్ హార్మోన్ లెవల్స్‌ను పెంచడం ద్వారా ఒత్తిడిని దూరం చేసి, రిలేక్సేషన్‌కు సహాయపడుతుంది. ఇక అరటిపండు కూడా మనలో ఒత్తిడి, ఆందోళనలను దూరం చేయగలిగే స్వభావం కలిగి ఉంటుంది. ఇందులోని ఫోలేట్ అండ్ విటమిన్ B6 సెరోటోనిన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. తినడంవల్ల మాసిసిక స్థితి మెరుగుపడుతుది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.