బేబీ ప్రొడక్ట్స్ కేవలం పిల్లలకేనా.. పెద్దలు కూడా వాడొచ్చా?

by Javid Pasha |
బేబీ ప్రొడక్ట్స్ కేవలం పిల్లలకేనా.. పెద్దలు కూడా వాడొచ్చా?
X

దిశ, ఫీచర్స్ : మొహానికి రాసే పౌడర్ నుంచి స్నానం చేసే సోప్ వరకు బయట మార్కెట్లో పిల్లలకోసం ప్రత్యేక ఉత్పత్తులు లభిస్తుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే బేబీ ప్రొడక్ట్స్‌కు డిమాండ్‌తో పాటు రేట్ కూడా ఎక్కువే. కాగా వీటిని కేవలం పిల్లలకు మాత్రమే యూజ్ చేయాలా?.. పెద్దలు వాడితే ఏం జరుగుతుందనే సందేహాలు కూడా ఇటీవల వ్యక్తం అవుతున్నాయి. అయితే పెద్దలు కూడా వాడవచ్చునని నిపుణులు చెప్తున్నారు. అలా వాడగలిగే ప్రొడక్ట్స్ ఏవో చూద్దాం.

డైపర్ రాష్ క్రీములు : పిల్లలకు డైపర్ రాష్ క్రీములు వాడుతుంటారు. అయితే పెద్దల్లో కూడా పెదాలు పొడిబారడం సహజం. వాటిని తిరిగి తేమగా చేయడానికి చిన్న పిల్లల డైపర్ రాష్ క్రీమ్‌ను యూజ్ చేయవచ్చు. ఇది పెదవులను మాయిశ్చరైజ్ చేయడంతోపాటు స్మూత్‌గా ఉంచుతుంది.

లోషన్లు : పిల్లలకు ఉపయోగించే లోషన్లను కూడా పెద్దలు వాడొచ్చునని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇవి చర్మంసై ప్రొటక్షన్ లేయర్‌ను క్రియేట్ చేస్తాయి. స్కిన్ అలెర్జీలను నివారిస్తాయి. స్కిన్ డ్రైగా మారకుండా చేస్తాయి. పిల్లలకు, పెద్దలకు ఒకే విధమైన ఫలితాన్ని కలిస్తాయి.

షాంపూ : సహజంగా పెద్దలు యూజ్ చేసే షాంపూతో తలస్నానం చేయడం అంత మంచిది కాదు. దీనివల్ల జుట్టులోని సహజ పోషకాలు దెబ్బతినే చాన్సెస్ ఉంటాయి. కానీ బేబీ షాంపూను అప్లై చేస్తే మాత్రం జుట్టులోని నేచురల్ ఆయిల్స్‌ను సేఫ్‌గా ఉంటాయి. అలాగే జుట్టు ఆరోగ్యం కూడా బాగుంటుంది.

బేబీ వైప్స్ : పిల్లల శరీరాన్ని తుడవడానికి బేబీ వైప్స్ యూజ్ చేస్తుంటారు. పెద్దలు కూడా తమ ముఖం, మెడకు పట్టిన చెమటను తుడవడానికి వీటిని యూజ్ చేయవచ్చు. మహిళలకు ఇవి మేకప్ రిమూవర్‌గానూ చక్కగా యూజ్ అవుతాయి.

పౌడర్ అండ్ ఆయిల్ : మహిళలు మేకప్ వేసుకున్న తర్వాత కొంచెం బేబీ పౌడర్ కూడా అప్లయ్ చేస్తే మేకప్ ఎక్కువ సేపు అలాగే ఉంటుంది. అట్లనే మొహం జిడ్డుగా మారకుండా కూడా కాపాడుతుంది. మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి పెద్దలు కూడా బేబీపౌడర్‌ను నిస్సందేహంగా యూజ్ చేయవచ్చు. అలాగే బేబీ ఆయిల్‌ను కూడా మేకప్ రిమూవ్ చేయడానికి యూజ్ చేయవచ్చు.

Advertisement

Next Story

Most Viewed