- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
#JOMO .. ఈ నయా ట్రెండ్ ఏంటో తెలుసా?
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం సోషల్ మీడియా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా అన్ని రకాల కమ్యూనికేషన్లకు నిలయంగా ఉంటోంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వేదికలో ఎకౌంట్ కలిగి ఉంటున్నారు. వరల్డ్‌వైడ్‌గా ఏ ఇన్ఫర్మేషన్ అయినా క్షణాల్లో ప్రత్యక్షమయ్యే మోస్ట్ పవర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్ ఏదైనా ఉందంటే అది సోషల్ మీడియానే. అయితే రీసెంట్‌గా #JOMO పేరుతో ఉన్న ఒక పోస్టు 53 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నందున అందరూ దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇంతకీ జోమో అంటే ఏమిటి? ఫోమోకి అది ఎలా భిన్నమైంది? నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.
సోషల్ మీడియాను స్ర్కోల్ చేయడం ఒక అలవాటుగా మారితన తర్వాత చాలామంది యూజ్ చేయకుండా ఉండలేరు. కొంతకాలం దూరంగా ఉండాల్సి వస్తే గనుక ఇబ్బందిగా ఫీలవుతారు. పైగా కొందరు సోషల్ మీడియాకు దూరంగా ఉండటంవల్ల అప్డేట్స్ మిస్సయ్యామని, ఫ్రెండ్ సర్కిల్స్‌లోని యాక్టివిటీస్ తెలియకుండా పోతున్నాయని, ఇన్విటేషన్లు, ముఖ్యమైన ప్రోగ్రాములు, అద్భుతమైన అవకాశాలను కోల్పోతున్నామనే ఆలోచనతో ఆందోళన చెందుతుంటారు. దీనినే ఫోమో (Fear of missing out) అంటారు. అయితే ఇందుకు భిన్నంగా సోషల్ మీడియాకు దూరమైనప్పటికీ ఎటువంటి ఆందోళన లేకుండా ఆనందంగానే ఉండగలిగితే దానినే జోమో (JOMO) అంటున్నారు నిపుణులు.
జోమో - ఫోమో లక్షణాలు
జోమో అనేది హ్యాపీనెస్‌కు సంబంధించిన ఒక అసాధారణ మానసిక స్థితి. ఇది తాము ముఖ్యం అని భావించే సోషల్ మీడియా కార్యకలాపాలకు దూరమైనప్పటికీ ఆందోళనకు గురిచేయదు. పైగా తాము ఏదో కోల్పోతామనే భయం(FOMO) వంటి భావాలకు వ్యతిరేకమైనది. ఇక ఫోమో అనేది తాము తరచుగా యూజ్ చేస్తున్న సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పుడు తమ నెట్‌వర్కును కోల్పోయాననే ఆందోళనను కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తులు తాము మిస్ అయినవి ఇంకొకరు అనుభవిస్తున్నట్లు ఊహించుకొని బాధపడుతుంటారు. తాము సోషల్ మీడియాకు దూరంగా ఉండటంవల్ల ఇతరులు దానిని యూజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని, తమకంటే వారు మెరుగైన స్థితిలోకి వెళ్తారేమోనని కూడా భ్రమ పడుతుంటారు. ఇటువంటి అతి ఆలోచనలు, ఆందోళనలవల్ల సదరు వ్యక్తులు తరచూ భావోద్వేగాలకు లోనవుతుంటారు. పైగా ఈ ఆందోళన వారి మానసిక ఆరోగ్యంపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది.
జోమోతో ఎందుకని హ్యాపీగా ఉంటారు?
కొందరు సోషల్ మీడియా నుంచి డిస్‌కనెక్ట్ అయినప్పటికీ ఆందోళన చెందరు. తమకు నచ్చిన విషయాలపై ఫోకస్ పెడతారు. కాబట్టి ఆనందకరమైన పరిస్థితి(జోమో)లో ఉంటారు. ఎందుకిలా ఉంటారనేది కూడా నిపుణులు ఎనలైజ్ చేశారు. ఏంటంటే.. తమ పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో తరచుగా పంచుకోవడం, ఎవరో ఒకరిని ఫాలో అవడం, ఫాలోవర్లు, చూసిన వారు ఏదో ఒకటి కామెంట్ చేయడం, మళ్లీ బాధితులు రియాక్ట్ అవడం వంటి పరిస్థితులు ఆందోళనకు, ఒత్తిడికి గురిచేస్తాయని, అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటామని జోమో సిచ్యువేషన్‌లో ఉండేవారు పేర్కొంటున్నారు. పైగా డిస్‌కనెక్ట్ అవ్వడంవల్ల హెల్తీ లైఫ్‌స్టైల్ అవర్చుకుంటామని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. కాబట్టి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నంతకాలం కూడా హ్యాపీగా ఉండాలనే సందేశం ఇవ్వడానికి ప్రజెంట్ ఇన్‌ఫ్లుయెన్సర్లు #JOMO పేరుతో ఆకట్టుకుంటున్నారు.