- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Eye gummies : ఐ గమ్మీలు కళ్లకు ఎలా ఉపయోగపడతాయి.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..
దిశ, ఫీచర్స్ : నేటి డిజిటల్ యుగంలో, మొబైల్, కంప్యూటర్, ఐఫోన్, ట్యాబ్ లేదా ల్యాప్‌టాప్‌లకు ఎవరూ ఎక్కువ కాలం దూరంగా ఉండలేరు. ఆ అలవాటు కళ్ళ పై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఇలాంటి సమస్యలను తొలగించుకునేందుకు అనే మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే రోజుల్లో విటమిన్ల నుండి స్లీపింగ్ గమ్మీస్ వరకు అన్నీ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల ప్రజలు చాలా ప్రయోజనం పొందుతున్నారు. ఐ గమ్మీస్ పిల్లలకు ఎంతో మేలు చేస్తుందని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కంటి చూపును మెరుగు పరచడంతో పాటు కంటి ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతున్నారు. దీని రెగ్యులర్ వినియోగం బ్లూ లైట్ వల్ల కలిగే హానిని నివారిస్తుందని చెబుతున్నారు.
పెద్దలకు కూడా ఐ గమ్మీలు...
ఇవి పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. ఐ గమ్మీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వృద్ధులలో దృష్టి స్పష్టత మెరుగు పడుతుందంటున్నారు. ఈ గమ్మీలలో సాధారణంగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
లుటీన్ : ఇది డిజిటల్ స్క్రీన్‌లు, సూర్యకాంతి నుండి హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేస్తుంది. అంతే కాదు ఇది రెటీనాను రక్షిస్తుంది.
ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు : ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు పిల్లలలో సాధారణ దృష్టి అభివృద్ధికి ముఖ్యమైనవి.
Zeaxanthin : ఇవి వాపు తగ్గించడం, ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే ఇది రెటీనాను హానికరమైన కాంతి, ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడానికి లుటీన్‌తో కలిసి పనిచేస్తుంది.
డిజిటల్ పరికరాలను అధికంగా ఉపయోగించడం, కాలుష్యం, తప్పుడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా కంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. పిల్లల నుండి పెద్దల వరకు, బలహీనమైన దృష్టి, కంటి అలసట, బ్లూ లైట్ ప్రభావం వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. అయితే ఐ గమ్మీలను వాడే ముందు ఖచ్చితంగా కంటి నిపుణుడిని సంప్రదించాలి. రెగ్యులర్ కంటి చెకప్‌లు, సరైన సంరక్షణ గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యమైనవి.
గమనిక : పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.