Swimming: వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

by Prasanna |   ( Updated:2023-04-01 08:41:23.0  )
Swimming: వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
X

దిశ, ఫీచర్స్: సమ్మర్ వచ్చిందంటే చాలామంది స్విమ్మింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతారు. కొత్తగా ఈత నేర్చుకునేవారు కూడా దగ్గరలోని చెరువులు, బావులు, సిటీలో అయితే స్విమ్మింగ్ పూల్‌లకు వెళ్తుంటారు. వేడి వాతావరణంలో ఈత కొట్టడం ఆనందాన్నిస్తుంది. ఈత ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే అప్పుడప్పుడూ స్విమ్మింగ్ పూల్స్ వాటర్‌లో క్లోరిన్ కలుపుతుంటారు. ఇది నీటిలో అధికంగా ఉన్నప్పుడు ఈతకొట్టడంవల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయి. చికాకుగా అనిపించడం, దురద, ర్యాషెస్ వంటివి వస్తాయి. అలాంటి సందర్భాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లే ముందు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం ద్వారా క్లోరిన్ ద్వారా చర్మంపై దద్దుర్లు రాకుండా ఉంటుంది. ఈత కొట్టడానికి ముందు డైమెథికాన్, గ్లిజరిన్, నూనెలు, పెట్రోలేటమ్ ఉన్న మాయిశ్చరైజర్‌ను వాడాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. చర్మంపై మాయిశ్చరైజర్ అప్లై చేయడంతోపాటు పూల్‌కు వెళ్లేకంటే 15 నిమిషాల ముందు వాటర్ ప్రూఫ్ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు స్విమ్మింగ్ గ్లాసెస్, స్విమ్మింగ్ క్యాప్ వాడటంవల్ల పూల్‌లో ఉండే క్లోరిన్ కారణంగా కళ్లకు, జుట్టుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Heart: గుండెను కాపాడే ఆహారపదార్ధాలేంటో తెలుసా?

Advertisement

Next Story