- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవిలో హెవీ వర్కవుట్స్ ప్రమాదకరం.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
దిశ, ఫీచర్స్ : హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌లో భాగంగా పలువురు జిమ్‌కు వెళ్తుంటారు. వర్కవుట్లతో తమ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయడంలో తప్పులేదు కానీ అన్ని సందర్భాలు, అన్ని సీజన్లలో ఒకే తరహా కసరత్తులు బెడిసి కొడతాయని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వేసవిలో హెవీ వర్కవుట్స్ చేసేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అవేంటో చూద్దాం.
* వేసవిలో వర్కువుట్స్ చేయడం అంత ఈజీ కాదు. హీట్ వెదర్ కారణంగా శరీరం చెమటలు పట్టడం, త్వరగా అలసిపోవడం వంటివి జరుగుతుంటాయి. అయితే మిగతా సీజన్ల మాదిరి వేసవిలో కూడా అంతేస్థాయిలో అధిక వ్యాయామం చేయడం మంచిది కాదు. దీనివల్ల తీవ్ర అలసటకు గురై డీహైడ్రేషన్ బారిన పడవచ్చు. మరి కొందరిలో కండరాల నొప్పి, జ్వరం వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో మిగతా సీజ్లనకంటే వర్కవుట్లు కాస్త తక్కువ సమయం చేయాలి.
* ఎండాకాలంలో చాలామంది చల్లటి పానీయాలు, ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే వీటిని తాగుతూ వర్కవుట్స్ చేయడంవల్ల త్వరగా అలసిపోతారు. పైగా ఎనర్జీ డ్రింక్స్‌వల్ల శక్తి రాదని, అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వేసవిలో వర్కవుట్లు చేసేవారు ఎనర్జీ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.
*కొందరు వర్కవుట్ ప్రారంభిస్తే గంటల తరబడి అలసిపోయినా అలాగే చేస్తుంటారు. కానీ ఇది ప్రమాదకరం. కాబట్టి 40 నుంచి 50 నిమిషాల తర్వాత ఓ ఐదారు నిమిషాలైనా విరామం తీసుకోవాలి. అయితే అందరికీ ఇదే సమయం సరిపోదు. తమ శారీరక అవసరాన్ని బట్టి వర్కవుట్స్ చేసేవారు మధ్యలో విరామం తీసుకోవాలి.
* వర్కవుట్ చేసేవారు తగినంత నీరు తాగకపోతే నష్టం జరుగుతుంది. అలాగని వెను వెంటనే తీరు తాగకూడదు. వర్కవుట్ తర్వాత కాసేపు రెస్టు తీసుకొని నీరు తాగడం మంచిది. అంతేకాకుండా బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సక్రమంగా ఉండాలంటే తగినంత నీరు తాగాలి.
* సరైన ఆహారం తీసుకోకుండా ఎన్ని వర్కవుట్లు చేసినా లాభం ఉండదు. పైగా తీవ్రమైన అలసట, వివిధ అనారోగ్యాలు సంభవించవచ్చు. అందుకని వ్యాయామాలు చేసేవారు తాము ఖర్చు చేసే శారీరక శ్రమకు అనుగుణంగా తగిన పోషకాహారం కూడా తీసుకోవాలి.
Read More : బయట తిరగడం మానేస్తే ప్రమాదంలో పడ్డట్లే.. శరీరంలో జరిగే హానికర మార్పులివే.