- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలేయానికి ముప్పు తెచ్చిపెడుతోన్న అధిక వ్యాయామం..తాజా అధ్యనయంలో వెల్లడి!!
దిశ, ఫీచర్స్: ఫిట్నెస్ కోసం చాలా మంది వ్యాయామాలు చేస్తుంటారు. మన శరీర బరువును నియంత్రించడానికి, కండరాలను దృఢంగా శక్తివంతంగా ఉంచడానికి, బోన్స్ స్ట్రాంగ్ చేయడానికి, వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చెందడానికి వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుంది. దైనందిక వ్యాయామం వల్ల అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చు.
వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే కానీ కఠిన వ్యాయామం రోగనిరోధక వ్యవస్థను అణచివేస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అతిగా ఏం చేసినా ముప్పే. వ్యాయామం ఎక్కువగా చేసిన ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుందన వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక వ్యాయామం మీ కాలేయ ఎంజైమ్ లను ప్రభావితం చేసే చాన్స్ ఉంటుంది. తరచూగా ఎక్సర్‌సైజ్ చేసేవాళ్ల కాలేయ ఆరోగ్యం బాగుంటుంది. కొవ్వు లేని కాలేయ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కానీ హెవీ లిఫ్టింగ్, విపరీతమై వ్యాయామం సమయంలో కాలేయ ఎంజైమ్ లు గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. లివర్ ఎంజైమ్ల పెరుగుదల కండరాలకు దారుణమైన హాని కలిగిస్తుంది. అలాగే రక్తం గడ్డ కట్టడం, కొన్నిసార్లు హార్మోన్లలో మార్పులు రావడం జరుగుతుంది. లివర్ లో మనం వేసుకునే మందులు, టాక్సిన్ లను విచ్ఛిన్నం చేసే పలు ఎంజైమ్ వ్యవస్థలు ఉంటాయి. లివర్ బ్లడ్ నుంచి విషాన్ని తొలగిస్తుంది. కాగా కాలేయం దెబ్బతినే చాన్స్ ఉంటుంది.
కఠినమైన ఎక్సర్‌సైజ్ చేసే వ్యక్తులపై తాజాగా క్రియేటిన్ కినేస్, మయోగ్లోబిన్ వంటి కండరాల-నిర్దిష్ట పరీక్షలు నిర్వహించారు. ఇది AST(aspartate aminotransferase) ALT ఎంజైమ్‌ల పరీక్షల్లో స్వల్పకాలిక పెరుగుదలను చూపించింది.
ఈ ఎంజైమ్‌లు వ్యాయామం చేసిన 3-4 రోజుల తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ పెరుగుదల కనుక కొనసాగితే లివర్ గాయం లేదా హెపటైటిస్ కు దారితీయవచ్చు. ఎలివేటెడ్ ALT, AST స్థాయిలు పాలీమయోసిటిస్, స్టాటిన్-ప్రేరిత కండరాల గాయాలు, తీవ్రమైన రాబ్డోమియోలిసిస్ వంటి కండరాల నష్టానికి సంభవించవచ్చు. కాగా ప్రతి రోజూ అధిక వ్యాయామం చేయకుండా మితమైన వ్యాయామం చేయడం మంచిది. కాలేయ ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్ తీసుకోండి. అలాగే మద్యం సేవించడం తగ్గించండి.