జీవితాన్నే మార్చగల సాయంకాలపు ఆలోచనలు.. ఎలా ప్రభావం చూపుతాయంటే..

by Javid Pasha |
జీవితాన్నే మార్చగల సాయంకాలపు ఆలోచనలు.. ఎలా ప్రభావం చూపుతాయంటే..
X

దిశ, ఫీచర్స్ : ఏదైనా ఒక విషయంలో పదే పదే నెగెటివ్‌గా ఆలోచిస్తే.. ఫలితం కూడా అలాగే ఉండవచ్చు. అదే పాజిటివ్‌గా ఆలోచించి చూడండి.. రిజల్ట్ కూడా అలాగే ఉంటుందని మానసిక నిపుణులు చెప్తుంటారు. అన్ని విషయాల్లో కాకపోయినా, మన రోజువారీ పనుల్లో, మనల్ని చుట్టు ముట్టే ప్రతికూల ఆలోచనలను అధిగమించడంలో ఇది చాలా అవసరం. అయితే తమకు డైలీ కొన్ని గంటలు ఆఫీసు వర్క్, మరి కొన్ని గంటలు ఇంటి పనులతోనే సరిపోతుందని దాదాపు అందరూ భావిస్తుంటారు. మిగతా సమయంలో రెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. కానీ ఇక్కడ విశ్రాంతితోపాటు కొన్ని ముఖ్యమైన ఆలోచనలు, అలవాట్లు కలిగి ఉండటం మంచిదని, అవి మీ జీవితాన్నే మార్చగలవని నిపుణులు అంటున్నారు. అవేమిటో చూద్దాం.

మైండ్ ఫుల్‌నెస్ రిఫ్లెక్షన్స్

కొందరు ఎప్పటి పరిస్థితిని బట్టి అప్పటి విషయాలపైనే ఫోకస్ చేస్తుంటారు. రోజు మొత్తంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకోవడంవల్ల లాభం లేదని అంటుంటారు. కానీ కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. ఆ రోజు మొత్తంలో మీరు ఏం చేశారో.. సాయంత్రం ఫ్రీ టైమ్‌లో లేదా రాత్రిపూట మీకంటూ కాసేపు సమయం కేటాయించుకొని గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోజు మీరు చేసిన పనులకు కారణంతోపాటు లోపాలు కూడా తెలుస్తాయి. దీనివల్ల మరుసటి పొరపాట్లు జరగకుండా చేయాల్సిన పనుల విషయంలో ఎఫెక్టివ్‌గా ప్లాన్ చేసుకోగలుగుతారు. ఇలా చేయడాన్నే నిపుణులు మైండ్ ఫుల్ రిఫ్లెక్షన్‌కు నిదర్శనంగా పేర్కొంటున్నారు.

వీటితో డిస్ కనెక్ట్ అవ్వండి

ఈరోజుల్లో మొబైల్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. మార్నింగ్ నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక అవసరం కోసం ఫోన్ యూజ్ చేస్తుంటాం. అయితే సాయంత్రం ఇంటికి వచ్చాక మీరు దానితో డిస్ కనెక్ట్ అవ్వడం మంచిది. అంటే ఇక్కడ కేవలం ఫోన్ ఒకటే అని కాదు, టీవీ, ల్యాప్‌టాప్, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్‌లు, సోషల్ మీడియా వంటి వాటితో కూడా డిస్ కనెక్ట్ అవ్వాలి. దీంతో మీరు టెన్షన్ ఫ్రీ అవుతారు. ఇతర విషయాల గురించి కాకుండా మీ గురించి మీరు ఆలోచిస్తారు. మెంటల్ రిలాక్సేషన్ లభిస్తుంది. ప్రతికూల ఆలోచనలు, ఆందోళనలు తగ్గిపోతాయి.

రీడింగ్ హాబిట్స్

స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక పుస్తకాలు చదివే అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది. కానీ ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. డైలీ కనీసం ఓ 40 నిమిషాలైన మీకు నచ్చిన పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకుంటే భాష, విషయ పరిజ్ఞానం పెరుగుతాయి. సామాజిక స్పృహ అలవడుతుంది. కొత్త విషయాలు తెలుసుస్తాయి. ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం, సృజనాత్మకత మెరుగుపడతాయి. దీనివల్ల మీలో మానసిక వికాసం కలిగి ప్రతికూల ఆలోచనలు దూరం అవుతాయి. ఇది మీరు చేసే రోజువారి పనులపై సానుకూల ప్రభావం చూపుతుంది.

రేపటి గురించి కూడా ..

కొందరు రేపటి విషయాలు ఇప్పుడే ఎందుకు? అంటుంటారు. కానీ మీరు ఏ రంగంలో సక్సెస్ అవ్వాలన్నా.. ముందు చూపు లేదా దూర దృష్టి ముఖ్యం. అందకే ఏ రోజు పనిని ఆరోజు కంప్లీట్ చేసుకున్నాక మరుసటి గురించి కూడా కాసేపు ఆలోచించి, తగిన ప్లాన్ చేసుకోవడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా మీటింగ్స్, అపాయింట్‌మెంట్స్, ఇంటర్వ్యూలకు అటెండ్ కావడం, ముఖ్యమైన ప్రాజెక్ట్ వర్క్, ఆఫీస్ వర్క్ పూర్తి చేసే విషయంలో ముందస్తు ప్లానింగ్ వంటివి మేలు చేస్తాయి. మీరు చేసే పనులకు సంబంధించి బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి. కాబట్టి సాయంత్రం లేదా రాత్రిపూట రేపటికోసం గురించి కూడా ప్లాన్ చేసుకోవడానికి ఎంతో కొంత సమయం కేటాయించండి.

Advertisement

Next Story

Most Viewed