- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ టీచర్ రూటే వేరు.. 93 వయసులో ఎంతటి సాహసం చేసిందంటే?
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది మనుషుల్లో బద్దకం పెరిగిపోతోంది. వండుకోవడానికి చేతకాక ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం, బట్టలు వాష్ చేసుకోవడానికి చేతకాక వాషింగ్ మెషీన్ వాడటం, నడవటం చేతకాక వాహనాలు వాడటం ఇలా అన్నింట్లో మనిషులు సుఖపడటానికి అలవాటు పడుతున్నారు. ఈ బద్దకం అనేది మధ్య వయసున్న వాళ్ల నుంచి చిన్నపిల్లలవరకూ పాకింది. కానీ, ఓ 93 పండు ముసలి ఉపాధ్యాయరాలు రోజు 140 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థులకు పాఠాలు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా.. ఆమె సాహసంపై ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకుడు పీవీపీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అభినందించారు. ''కుదిరితే పరిగెత్తు..లేకపోతే నడువు..అదీ చేతకాకపోతే పాకుతూ పో..అంతేకాని ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు అన్నారు శ్రీశ్రీ, ఈ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ, 93 ఏళ్ల వయసులో రోజు 140 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు చెప్తున్న ప్రొఫెసర్ శాంతమ్మ గారికి వందనాలు.'' అంటూ సోషల్ మీడియా వేదికగా పీవీపీ అభినందించారు.