స్విస్ ఖండంలో కాక్టిస్ మొక్కల పెరుగుదల దేనికి సంకేతం !

by samatah |   ( Updated:2023-02-14 04:42:40.0  )
స్విస్ ఖండంలో కాక్టిస్ మొక్కల పెరుగుదల దేనికి సంకేతం !
X

దిశ, ఫీచర్స్ : స్విస్ (స్విడ్జర్లాండ్) ఖండంలోని వలైస్ ప్రాంతం మంచుపర్వతాలతో కూడి ఉంటుంది. ఇక్కడి వాతావరణం స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇక్కడ నివసించే ప్రజలు వింటర్ సీజన్‌లో మంచుతో కప్పబడిన పర్వతాలను, అలాగే సమ్మర్ సీజన్ అయితే ఎడెల్వీస్ ఫ్లవర్స్‌తో నిండిన కొండలను చూస్తూ ఆనందిస్తుంటారు. కానీ భవిష్యత్తులో ఇటువంటి ఆనందం ఆవిరై పోనుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో స్విస్ ఖండంలోని ప్రాంతాల్లో చల్లటి వాతావరణం, అలాగే మంచు శాతం క్రమంగా తగ్గుతోంది. అలాగే ఇక్కడి పర్వత శ్రేణుల్లో కాక్టిస్ మొక్కల పెరుగుదల ఇక్కడి సహజ ప్రకృతి అందాలను ప్రభావితం చేసే ప్రమాదం సంకేతం కావచ్చని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు. స్విస్ ఖండంలోని వలైస్ పర్వత ప్రాంతాలు వలసవాదుల ఆక్రమణలకు కూడా గురవుతుండటంవల్ల ఇక్కడ అనేక సమస్యలు ఏర్పడుతన్నాయి. అలాగే గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో క్రమంగా వేడి వాతావరణం పెరుగుతూ, మంచు శాతం తగ్గుతూ వస్తోంది. అంతేగాక వేడి, పొడి వాతావరణం కలిగిన ప్రాంతాలలో, ఏడారులలో మొలిచే కాక్టిస్ మొక్కలు ఇక్కడి కొన్ని పర్వత ప్రాంతాల్లో పెరగడం అనేది పర్యావరణ ప్రేమకులను ఆందోళనకు గురిచేస్తోంది. గ్లోబల్ వార్మింగ్ పర్యవసనాలకు నిదర్శనంగా ఈ పరిణామాలు సంభవిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

జీవ వైవిధ్యంపై ప్రభావం

పర్యావరణ నిపుణుల ప్రకారం.. కాక్టస్ జాతి మొక్కలు వలైస్‌లోని వివిధ ప్రాంతాలలో విస్తరిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని ప్రకృతి సహజ మొక్కల స్థానాన్ని ఇవి ఆక్రమిస్తున్నాయి. దీనివల్ల జీవ వైవిధ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. పొడి, వేడి వాతావరణాల్లో పెరిగే స్థానికేతర కాక్టిస్ మొక్కలు సహజంగా మంచు ప్రాంతాల్లో, పచ్చిక బయళ్లలో పెరగవు. కానీ ఇక్కడ పెరగడం భవిష్యత్తులో ఇక్కడి ప్రకృతిపై ప్రభావం పడి, ఇక్కడి జీవ వైవిధ్యం దెబ్బతింటుంది అని రోన్ వ్యాలీకి చెందిన పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సియోన్ చుట్టు పక్కల ఏం జరుగుతోంది

కాక్టి వలైస్ మొక్కలు స్విస్ ఖండంలోని సియోన్ చుట్టు పక్కల గల కొన్ని కొండలపై కూడా పెరుగుతున్నాయని అక్కడి పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలైస్ కొండల్లో ప్రకృతి సంరక్షణ కోసం పనిచేస్తున్న జీవశాస్త్రవేత్త యాన్ ట్రిపోనెజ్ మాట్లాడుతూ.. ''భవిష్యత్తులో వలైస్‌లోని కొండ ప్రాంతాల్లో కాక్టిస్ మొక్కలు లేదా వృక్షాలు మూడింట ఒకవంతు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నాం. ఇది ఆందోళన కలిగించే అంశం'' అన్నాడు. అంతేకాదు ఈ మొక్కలు 18వ శతాబ్దంలో ఉత్తర అమెరికాలో కూడా కనిపించాయట. తర్వాత అక్కడ తగ్గు ముఖం పట్టాయి. ప్రస్తుతం వలైస్‌లో పెరుగుతూ పర్యావరణానికి ప్రమాద సంకేతాలను సూచిస్తున్నాయని యాన్ ట్రిపోనెజ్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి : సూర్యుడి X-Ray.. ఏం చెప్తోంది?

tag :

Slug :

Advertisement

Next Story

Most Viewed