గుండెపై పారాసెటమాల్ ప్రభావం.. ఎలా వాడితే మంచిదంటే?

by Disha Web Desk 8 |
గుండెపై పారాసెటమాల్ ప్రభావం.. ఎలా వాడితే మంచిదంటే?
X

దిశ, ఫీచర్స్ : పారాసెటమాల్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. చిన్నగా జ్వరం వచ్చినా, ఒంట్లో నలతగా అనిపించినా ప్రతి ఒక్కరూ పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోవడం అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒకరి ఇంట్లో ఈ ట్యాబ్‌లెట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ప్రతి చిన్న సమస్యకు ఈ మెడిసిన్ వాడే వారికి షాకింగ్ న్యూస్. తాజాగా జరిపిన అధ్యయనంలో దీని గురించి షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. గుండె సిగ్నలింగ్ మార్గాలపై పారాసెటమాల్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని వారు తెలిపారు.

డేవిస్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పారసెటమాల్ తీసుకోవడం మంచిదేనా? దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయని, ఎలుకలపై ప్రయోగించగా.. అవి వాటి గుండె కణజాలంలో ప్రోటీన్లు మారినట్లు పరిశోధకులు కనుగొన్నారు. దీనిలో పారాసెటమాల్​ ఇచ్చిన ఎలుకలపై ఏడు రోజులు ట్రయల్ చేసిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించినట్లు వారు తెలిపారు. ఇది గుండెలోని 20కి పైగా సిగ్నలింగ్ మార్గాలను ప్రభావితం చేసిందని అందువలన పారాసెటమాల్ అధికంగా వాడటం మంచిది కాదని వారు పేర్కొన్నారు.

ముఖ్యంగా ఇది ఎక్కువగా వాడటం వలన గుండె సమస్యలు పెరుగుతున్నాయని వారు హెచ్చరికలు జారీ చేశారు. అందువలన ఈ మెడిసన్ వాడే ముందు వైద్యులను సంప్రదించాలని, పెద్దలు 500mg ట్యాబ్లెట్స్ ఒక రోజులో నాలుగు సార్లు తీసుకోవచ్చు, కానీ మధ్యలో నాలుగు గంటల గ్యాప్ ఇవ్వాలని పేర్కొన్నారు. దీనిని రోజులో 8 కంటే ఎక్కువగా అస్సలే తీసుకోకూడదు.

Next Story

Most Viewed