భోజనం చేశాక స్వీట్స్ తీసుకుంటున్నారా?

by Prasanna |   ( Updated:2023-08-19 07:23:33.0  )
భోజనం చేశాక స్వీట్స్ తీసుకుంటున్నారా?
X

దిశ,వెబ్ డెస్క్: మనలో చాలా మంది తిన్న తర్వాత స్వీట్లు తింటేనే వారికి తిన్నట్టు ఉంటుంది. అలాగే ఫంక్షన్లో స్వీట్ తప్పకుండా ఉంటుంది. ప్రతి వేడుకలో స్వీట్లు తినడనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. అయితే భోజనం తిన్నాక స్వీట్ తినడం వలన మన ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

స్వీట్లను ఎక్కువగా పంచదారతో తయారు చేస్తారు. పంచదార అనేది ప్రాసెస్డ్ ఫుడ్, అంటే అధికంగా శుద్ధి చేసిన పదార్థం. ఇలా ఎక్కువగా శుద్ధిచేసిన ఆహారాలు మన ఆరోగ్యానికి అంత మంచివి కావని నిపుణులు పరిశోధనలు చేసి వెల్లడించారు. వాటిలో ముఖ్యంగా పంచదారతో చేసిన స్వీట్లు తినడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు ఒకేసారి పెరుగుతాయి. కాబట్టి భోజనం తిన్న తర్వాత స్వీట్లను దూరం పెట్టడమే మంచిది. స్వీటు తిన్నాక ఒక గంట వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకండి. కనీసం రెండు గంటలు గ్యాప్ ఇచ్చి భోజనం చేయండి. మీకు స్వీట్ తినే ఆలోచన వస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి చాక్లెట్ ను తినండి లేకపోతే చిన్న బెల్లం ముక్క తినండి. తిన్న తర్వాత 10 నిముషాలు నడవండి. ఇలా చేయడం వల్ల మీకు స్వీట్ తినాలన్న కోరిక తగ్గిపోతుంది.

Read More:

పెరుగులో ఎండుద్రాక్ష కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా?

పూలను తుంచి పూజ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Advertisement

Next Story