Health : ఈ టైమ్‌లో‌గా తినకపోతే రిస్క్‌లో పడ్డట్లే.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

by Javid Pasha |   ( Updated:2024-12-09 09:53:06.0  )
Health : ఈ టైమ్‌లో‌గా తినకపోతే రిస్క్‌లో పడ్డట్లే.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు!
X

దిశ,ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా జీవించాలంటే రోజూ మూడుపూటలా ఆహారం తినాల్సిందే. అయితే అధికంగా తిన్నా, మరీ తక్కువగా తిన్నా హెల్త్ పరంగా నష్టపోతాం. ఇవేకాకుండా సమయానికి తినకపోవడం, రాత్రిళ్లు ఆలస్యంగా తినడం కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. లేట్‌గా తింటే డయాబెటిస్ సహా పలు రకాల హెల్త్ ఇష్యూస్ పెరుగుతాయని స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాటలోనియా (University of Catalonia), అలాగే కొలంబియా యూనివర్సిటీ నిపుణుల అధ్యయనంలోనూ వెల్లడైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

కొందరు రాత్రి భోజనాన్ని మరీ ఆలస్యంగా 11 గంటలలోపు ఎప్పుడైనా తింటుంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు పరిశోధకులు. శరీరంలో గ్లూకోజ్ జీవక్రియకు, ఇన్సులిన్ పనితీరుకు ఆటంకం ఏర్పడుతుందని, ఫలితంగా రోజూ ఆలస్యంగా తినేవారిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందని చెబుతున్నారు. సాయంకాలం 6 నుంచి 8 గంటలలోపు ఆహారం తీసుకుంటే కేలరీల్లో 45 శాతానికి పైగా రక్తంలో చక్కెర స్థాయిల లెవల్స్‌పై సానుకూల ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. కాగా ఆలస్యంగా తినడంవల్ల మాత్రం మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు. ఎందుకంటే.. రాత్రిపూట బాడీలో తక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ కావడం వల్ల గ్లూకోజ్‌ను శోషించే ఎనర్జీని శరీరం కోల్పోతుంది.

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 50 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసుగల 26 మందిని రెండు గ్రూపులుగా విభజించారు. వీరిలో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు, లేనివారు కూడా ఉన్నారు. కాగా వీరందరికీ ఒకే రకమైన ఆహారాన్ని ఇచ్చారు. అయితే ఒక గ్రూపు వారు త్వరగా, మరో గ్రూపు వారు రాత్రి ఆలస్యంగా తినాలని రీసెర్చర్స్ సూచించారు. కొంతకాలం తర్వాత వారి హెల్త్ డేటాను విశ్లేషించిన పరిశోధకులు, రాత్రిపూట ఆలస్యంగా తింటున్నవారిలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతున్నట్లు గుర్తించారు. దీనివల్ల డయాబెటిస్, అధిక బరువు, ఒబేసిటీ, గుండె జబ్బులు వంటి రిస్క్ పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. అలాగే గ్యాస్ ప్రాబ్లం, నిద్రలేమి, అజీర్తి, కడుపులో ఉబ్బరం, ఛాతీలో మంట వంటి సమస్యలన్నీ ఆలస్యంగా తినడంవల్ల తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి రాత్రి భోజనం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు చేస్తేనే మంచిదని సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed