- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రాన్ బెర్రీలు రోజూ తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
దిశ, ఫీచర్స్: ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు క్రాన్ బెర్రీలలో మెండుగా ఉంటాయి. వివిధ రకాల రోగాల నుంచి రక్షణ కోసం వీటిని తినడం మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. చిన్నగా, గుండ్రంగా, ఎర్రగా ఉండే క్రాన్ బెర్రీలు కాస్త చేదు, కాస్త పులుపు కలగలిసిన రుచిని కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్, ఫైటో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
క్రాన్ బెర్రీలలో ప్రోయాంతో సైనిడిన్స్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి సహజ యాంటీ బాక్టీరియల్ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఎస్చెరిచియా కోలి బ్యాక్టీరియా వంటివి మూత్ర నాళంలో చేరి రోగాలు కలిగించకుండా నిరోధించగలుగుతాయి. క్రాన్ బెర్రీలలోని ఫైటో న్యూట్రియెంట్స్ గాయాలు, ఇన్ఫెక్షన్ వల్ల కలిగే నొప్పి, మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. హార్ట్ డిసీజెస్‌ను కూడా నివారిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే శక్తివంతమైన ఫైటోకెమికల్స్ ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఇ, క్వెర్సెటిన్ ఉంటాయి. ఇవి వృద్ధాప్యానికి దారి తీసే ఫ్రీ రాడికల్స్ కణాల నష్టాన్ని నివారిస్తాయి. క్రాన్ బెర్రీల్లోని విటమిన్ సి చర్మంపై కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. కొల్లాజెన్ వేడి వాతావరణం నుంచి, యువి కిరణాల ప్రభావం నుంచి మనల్ని రక్షిస్తుంది.
Read more: