- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్‌తో అనారోగ్యాలు.. తలనొప్పి, మైగ్రేన్ కూడా రావచ్చు!
దిశ, ఫీచర్స్ : డయాబెటిస్ పేషెంట్లు షుగర్‌తో చేసిన పదర్థాలకు బదులుగా లో కేలరీస్ ఉండే సకారిన్, సుక్రాలోజ్, నియోటేమ్, ఆస్పర్టేమ్ వంటి ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు తినడంవల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని కొందరు చెప్తుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. కృత్రిమ చక్కెరలు కూడా ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. వీటిలో తక్కువ కేలరీలు ఉండొచ్చు. కానీ తినడంవల్ల వెయిట్ పెరగడంతోపాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని, లివర్ హెల్త్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు చెప్తున్నారు.
బరువు పెరగడం
ఆర్టిఫిసియల్ స్వీటెనర్స్ టేస్టులో షుగర్ లాగే ఉండి లో కేలరీస్ కలిగి ఉంటాయని పలువురు నమ్ముతుంటారు. ఇవి అధిక బరువు పెరగానికి దోహదం చేస్తాయని అనేక అధ్యయనాల్లో తేలింది. అంతేగాక వీటిని ఒకటికి రెండుసార్లు తిన్న తర్వాత తరచూ తినాలనే కోరికను పెంచుతాయి. శరీరంలో కేలరీలను నియంత్రించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఈ కారణంగా అతిగా తినడం, బరువు పెరగడం జరిగిపోతాయి.
మెంటల్ హెల్త్
మెదడులోని న్యూరో ట్రాన్స్‌మిటర్ లెవల్స్‌ను ప్రభావితం చేసే గుణం కృత్రిమ చక్కెరలకు ఉంటుంది. అందుకే వీటిని తినడంవల్ల మానసిక స్థితిలో, ప్రవర్తనలో మార్పు రావచ్చు. బ్రెయిన్‌లోని సిరటాయిన్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంవల్ల ఆందోళన, భావోద్వేగాలు పెరుగుతాయి.
లివర్ హెల్త్‌పై ఎఫెక్ట్
ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యలకు కారణం అవుతాయి. ఎందుకంటే వీటిలో ట్రై గ్లిసారాయిడ్ కొలెస్ట్రాల్ పర్సంటేజ్ ఉంటుంది. అస్పార్టమె ఇంకా వివిధ స్వీటెనర్లలో కూడా ట్రై గ్లిసారాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌లో పేరుకుపోయి అనారోగ్యానికి కారణం అవుతాయి.
తలనొప్పి, మైగ్రేన్
టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులను కృత్రిమ చక్కెరలు ప్రేరేపించే గుణాన్ని కలిగి ఉంటాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కొన్ని రకాల చక్కెరలు ఇన్సులిన్ నిరోధకతను, మంటను పెంచుతాయి. మరికొన్ని మెదడు పనితీరు, నాడీ వ్యవస్థపై ఎఫెక్ట్ చూపుతాయి. న్యూరో ట్రాన్స్‌మిటర్ లెవల్స్‌లో హెచ్చు తగ్గులను ప్రభావితం చేస్తాయి. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలకు కారణం అవుతాయి. కాబట్టి ఆర్టిఫిసియల్ స్వీటెనర్లు తినడం మంచిది కాదని, డయాబెటిస్ పేషెంట్లు అస్సలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.