- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతిరోజూ గుడ్డు తింటున్నారా? సైడ్ ఎఫెక్ట్స్ తప్పవంటున్నారు నిపుణులు!
దిశ, ఫీచర్స్: ప్రతిరోజు ఒక గుడ్డు తింటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని డాక్టర్లు చెబుతుంటారు. ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్-ఇ అధికంగా ఉంటాయి. ఒక గుడ్డు నుంచి 6.29 గ్రాముల ప్రోటీన్తో పాటుగా 78 క్యాలరీలు అందుతాయని పరిశోధనలో వెల్లడైంది. గుడ్డులో మాంసకృత్తులు సమృద్ధిగా ఉండడం వల్ల మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. అయితే ప్రతి రోజూ గుడ్డు తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే చాన్స్ ఉందని తాజాగా నిపుణులు చెబుతున్నారు.
కొలెస్ట్రాల్ పెరగడం..
ప్రతిరోజూ ఒక్క ఎగ్ తింటే మంచిదే గానీ.. అంతకంటే ఎక్కువ తీసుకున్నట్లైతే.. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో కార్డియోస్కులర్ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.
అలర్జీ సమస్యలు..
ఎగ్‌లో ఉండే తెల్ల సొనలో అవిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. కాగా ఎక్కువగా గుడ్డు తిన్నట్లైతే.. బయోటిన్ లోపం వచ్చే చాన్స్ ఉంది. కొంతమందికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవచ్చు. కొంతమందికి గుడ్లు తీసుకోవడం వల్ల అలెర్జీలు వస్తాయంటున్నారు. తినగానే దద్దుర్లు వంటి సమస్యలు కనిపిస్తే మీకు అలెర్జీ ఉన్నట్లు. అలాంటివారు గుడ్డు తినకుండా ఉండే మేలు.
కొంతమందికి స్టమక్ పెయిన్ వస్తుంది. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. ఎప్పుడైనా సరే ఎగ్ ను పూర్తిగా ఉడికించాలి. లేకపోతే సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియా బాడీలో చేరి.. ఆరోగ్యం నశిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, బాలింతలు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నవారు గుడ్లను వండాకే తినడం మేలు.